షుగర్ ఉన్నవాళ్లు అల్పాహారంలో ఇవి తింటే.. షుగర్ అస్సలు పెరగదు..!

-

ఒక్కసారి షుగర్ వచ్చిందంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో షుగర్ కారణంగా బాధపడుతున్నారు. ఉదయం పూట బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు మెలకువగా ఉండడం లేదంటే సరైన నిద్ర లేకపోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్లు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఎలాంటివో అల్పాహారాన్ని తీసుకోవచ్చు అనేది చూస్తే.. మల్టీ గ్రైన్ బ్రేడ్, గుడ్డు కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి మంచిది.

అల్పాహారంలో ఒక గుడ్డును వారానికి మూడు రోజులు చేర్చుకోవచ్చు. గుడ్డుతో ఆమ్లెట్ తక్కువ నూనె లేదా వెన్నతో వేసుకుని సగం ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. మల్టీ గ్రైన్ బ్రెడ్ తో టోస్ట్ గా తీసుకోవచ్చు. వెజిటేబుల్ ఉప్మా తీసుకుంటే కూడా షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హాని కలగదు. బీన్స్, బఠానీ, ఉల్లిపాయలు వంటివి వేసుకుని మీరు ఉప్మా తయారు చేసుకొని తీసుకోవచ్చు. బొంబాయి రవ్వతో ఆరోగ్యకరమైన ఉప్మా తయారు చేసుకోవచ్చు.

పెసరట్టు కూడా తీసుకోవచ్చు. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఈ పప్పుని మీరు రుబ్బుకుని తీసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసుకుని మీరు దోసని తయారు చేసుకోవచ్చు. అలాగే షుగర్ ఉన్నవాళ్లు మఖాన వేయించి తీసుకుంటే ఉదయాన్నే మంచిది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మఖాన రుచిగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలని పెంచకుండా చూస్తుంది అలాగే దీనితో పాటు ఒక కప్పు పాలు కూడా తీసుకోవచ్చు ఇలా షుగర్ ఉన్న వాళ్ళు వీటిని ఫాలో అయ్యారంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి హెల్తీగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version