పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, దాని మిత్రపక్షాలు, ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలోనే లోక్‌సభలో ఈ బిల్లు పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ ప్రతిపక్షాలకు పలు ప్రశ్నలు సంధించారు.
‘2006లో వక్ఫ్ బోర్డు దగ్గర 4.9 లక్షల ఆస్తులు ఉండేవి. అప్పుడు దాని ఆదాయం 166 కోట్లు. 2025లో 8.72 లక్షల ఆస్తులు ఉన్నాయి. కానీ, ఆదాయం 9.92 కోట్లు మాత్రమే. మార్కెట్ రేట్ ప్రకారం లీజుకి ఇస్తే వక్ఫ్‌కి ఏడాదికి 20-25వేల కోట్ల ఆదాయం రావాలి.కానీ, పేద ముస్లింలకు చెందాల్సిన ఈ ఆదాయం ఎవరి జేబులోకి పోతుంది?’ అని ఆయన సభలో ప్రశ్నించారు.