చపాతీలు తింటే నిజంగానే బరువు తగ్గుతారా..? అంత మీ భ్రమేనా..!

-

బరువు తగ్గాలి అని చెప్పగానే.. అందరూ ముందు నైట్‌ రైస్‌ తినడం మానేసి.. చపాతీలు తిను అంటారు.. చాలామంది ఇలానే చేస్తారు. అసలు చపాతీలు తింటే బరువు తగ్గుతారా.. అంతా మీ భ్రమేనా.. అంటే చపాతీలు తిన్నా.. బరువు తగ్గని వాళ్లు ఎందరూ.. ఈరోజు మనం చపాతీలు తింటే బరువు తగ్గుతారా లేదా అనేది చూద్దాం..!

చ‌పాతీల‌కు, బ‌రువు త‌గ్గేందుకు సంబంధం లేదు. అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. చాలా మంది చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అన్నంలో, చ‌పాతీల‌ను త‌యారు చేసేందుకు వాడే గోధుమ పిండిలో పిండి ప‌దార్థాలు (కార్బొహైడ్రేట్లు) దాదాపుగా స‌మానంగానే ఉంటాయి. అందువ‌ల్లే వేటిని తిన్నా మ‌న శ‌రీరానికి కార్బొహైడ్రేట్లు అందుతాయి. అయితే నిత్యం కార్బొహైడ్రేట్లతో పాటు కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను స‌మ‌పాళ్ల‌లో తీసుకోవాలి.

స‌మ‌తుల ఆహారంతోపాటు నిత్యం మ‌నం ఎన్ని క్యాల‌రీల ఆహారాన్ని తింటున్నాం, ఎంత మేర క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తున్నాం అన్నది ముఖ్యం.. శారీరక శ్ర‌మ చేయ‌ని వారికి నిత్యం 1500 క్యాల‌రీల శ‌క్తినిచ్చే ఆహారం స‌రిపోతుంది. కానీ నిజానికి చాలా మంది ఇంత‌క‌న్నా ఎక్కువ‌ క్యాల‌రీల‌ను తీసుకుంటున్నారు. దీంతో అధికంగా ఉండే క్యాల‌రీల తాలూకు శ‌క్తి అంతా కొవ్వుగా మారుతుంది. ఫ‌లితంగా బ‌రువు పెరుగుతున్నారు..

మ‌నం తీసుకునే ఆహారం ద్వారా ల‌భించే క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసే ప్ర‌య‌త్నం చేయాలి. నిత్యం 2వేల క్యాల‌రీల ఆహారాన్ని తీసుకుంటే అందులో 200 నుంచి 300 క్యాల‌రీలను ఖ‌ర్చు చేయాలి. లేదా 1500 క్యాల‌రీల ఆహారాన్ని తీసుకుంటే అందులో 100 నుంచి 200 క్యాల‌రీలను ఖ‌ర్చు చేసే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఇక మ‌నం ఆహారంలో అన్నం తింటున్నామా, చ‌పాతీలు తింటున్నామా.. అన్నది మ్యాటర్‌ కాదు. తిన్న వాటిని ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నది మ్యాటర్.. శారీర‌క శ్ర‌మ చేయ‌ని వారు ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. దీంతో పాటు వ్యాయామం కూడా చేస్తే బ‌రువు త‌గ్గొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version