తులసి ఆకులే కాదు.. తులసి గింజలు కూడా ఆరోగ్య కారకాలే. వీటిలో ఉండే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు.. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి.
తులసిని హిందువులు దేవుడిగా కొలుస్తారు. తులసి చెట్టు ఉండని హిందువుల ఇల్లు ఉండదు. ప్రతి రోజూ స్నానం చేశాక తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేసి తమ పనులు చేసుకుంటారు. తులసి అంటే అంత పవిత్రమైంది. మరి.. ఆ తులసి చెట్టులో దైవ గుణాలే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే తులసిని సర్వగుణ సంపన్న చెట్టు అని పిలుస్తారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు హై బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి తులసి ఆకులు ఎంత ఉపయోగపడతాయి.
తులసి ఆకులే కాదు.. తులసి గింజలు కూడా ఆరోగ్య కారకాలే. వీటిలో ఉండే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు.. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు తమ ఆహారంలో తులసి ఆకులను భాగంగా చేసుకుంటే బ్లడ్ లోని షుగర్ లేవల్స్ ను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్లలో ఇన్సులిన్ గ్రంథి ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా తులసి ఆకులు చేస్తాయి. దీంతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
మీకు ఒకవేళ డయాబెటిస్ వచ్చే సూచనలు ఉన్నా… టైప్ 2 డయాబెటిస్ వచ్చినా, బరువు తగ్గాలనుకున్నా, హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేసుకోవాలన్నా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలన్నా.. రోజూ తులసి ఆకులను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
అయితే.. తులసిలో ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ.. దీన్ని ఎవరు పడితే వాళ్లు తినకూడదట. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాలట.