ఈరోజుల్లో చాలా మందిని వేధించే సమస్య నిద్రలేమి. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఎలాగోలా ఏ అర్థరాత్రికో నిద్రలోకి జారుకుంటాం.. అయితే నిద్రపట్టకపోవడానికి కొందరికి రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్(Syndrome) అయి ఉండొచ్చంటున్నారు నిపుణులు. అదేనండీ..మీరు గమనించే ఉంటారు..మీ ఇంట్లోనో లేక..హాస్టల్ మీ బెడ్ మెట్ ఎవరో ఒకరు నిద్రలో కాళ్లు ఊపుతూనే ఉంటారు. కానీ అది వారి అలవాటుగా మనం అనుకుంటాం..కానీ ఇది కూడా ఒక సమస్యే. ఇది ఎందుకు వస్తుంది, నివారణ చర్యలేంటి.. వంటి విషయాలను ఈరోజు చూద్దాం.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్..
కాళ్లను ఎక్కువగా కదిలించడం మూలంగా కలిగే నిద్ర రుగ్మత గుణాన్నే రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్(RLS) అంటారు.. సాధారణంగా సాయంత్రం, రాత్రి సమయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ వ్యక్తి కాళ్లు కదపకుండా ఉండలేరు. కదిలిస్తూ ఉంటేనే హాయిగా ఉంటారు. కానీ కాళ్ల కదలిక ఆగిందంటే నిద్రపట్టడం దాదాపు అసాధ్యం.
లక్షణాలేంటి?
దీనికి పెద్దగా లక్షణాలు అంటూ ఏం ఉండవు..మన కంట్రల్ లేకుండానే కాళ్లు కదులుతూ ఉంటాయి. విశ్రాంతి లేకపోవడం. రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు అని చెప్పవచ్చు. ఏ పని మీదా ఏకాగ్రత ఉండదు. RLS ఉన్న వ్యక్తులు సినిమాలకూ వెళ్లలేరు. రైలు, విమానంలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు కూడా.
కారణాలేంటి?
RLS వ్యాధికి పక్కా కారణాలు తెలియదు. కానీ.. కాళ్లలో కదలికల వల్ల వచ్చే రియాక్షన్ ను మెదడు నియంత్రించే నరాల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఇది ఏర్పడుతుంది..ఈ పరిస్థితి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. కొందరికి శరీరంలో ఐరన్ స్థాయి తక్కువైనా, కిడ్నీల ఫెయిల్యూర్, మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల దుష్ప్రభావం కారణంగానూ కూడా ఇలా జరుగుతుంది.
లావెండర్ సబ్బు..
ఇది కొంచెం అసహంజంగా అనిపించినప్పటికీ నిజంగానే పనిచేసే కొన్ని టిప్స్‌ను బాధితులు పాటించవచ్చు. దీనిపై ఒక ఎక్స్‌పర్ట్ మాట్లాడుతూ.. పడుకునేముందు బెడ్ షీట్‌ల కింద కాళ్ల దగ్గర సబ్బు పెట్టమని సూచించారు. అంతేగాక ప్రత్యేకంగా లావెండర్ సబ్బు అయితే మరీ మంచిదట.
ఎందుకంటే.. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించే గుణం లావెండర్ కు ఉంది.
లావెండర్ సోప్ హీలింగ్ టెక్నిక్ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కానీ.. చాలా మంది ఈ చిట్కాతో ఉపశమనం పొందామని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన అనేకమంది ఇది పరవాలేదని అంటున్నారు. అంతేకాదు..నిద్రపట్టక రాత్రుళ్లు ఇబ్బంది పడే వాళ్లు కూడా ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తున్నారట. మీకూ ఈ సమస్య ఉంటే ట్రే చేయండి..పోయేదేముంది..రిజల్ట్ వస్తే మనకే హాయిగా నిద్రపడుతుంది కదా..!