తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బుధ వారం రెండు పార్టీ కార్యకర్తల మధ్య కర్రల యుద్ధం జరిగింది. కాగ బుధవారం జరిగిన దాడిలో గాయ పడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటల రాజేందర్ జనగాం కు బయలు దేరాగా వారిని అడ్డుకున్నారు. అలాగే జనగాంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా బీజేపీ నాయకులు మౌన దీక్ష చేశారు.
అనంతరం.. జనగాం లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరారు. కాగ అప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న టీఆర్ఎస్ నాయకులు.. అంబేద్కర్ విగ్రహానికి పాల అభిషేకం చేశారు. అయితే రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బీజేపీ కార్యకర్తలను పార్టీ కార్యాలయనికి తరలించి అరెస్టు చేశారు. అంతే కాకుండా బీజేపీ నాయకులను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
అలాగే జనగాంలోని నర్మెట్ట చౌరస్తాలో ఈ రోజూ కూడా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కర్రాల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు పార్టీల నాయకులను శాంతింప చేసి.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.