ఎముకల పుష్టికి ఆలుబుక్రా ఉపయోగపడుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

-

ఆలుబుక్రా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో నెంబర్ వన్ సిట్రస్ ఫ్రూట్ ఇది..ఈ పండును ఎవరు ఎక్కువగా తినొచ్చు..అసలు ఈ పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుంది. అధ్యయనాలు ఏం నిరూపించాయి, ఇందులో ఏం పోషకాలు ఉన్నాయి అనేవి పూర్తిగా చూద్దాం.

100 గ్రాముల ఆలుబుక్రాలో( plums) ఉండే పోషకాలు

నీటి శాతం 87 గ్రాములు
పిండిపదార్థాలు 11గ్రాములు
శక్తి 44 కాలరీలు
పీచుపదార్థాలు 1.5 గ్రాములు
తక్కువ కాలరీలు ఉండి..నీటిశాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్..షుగర్ ఉన్నవారికి, కొలెస్ట్రాల్, అధికబరువు, ట్రైగ్లిజరయిడ్స్, గుండెజబ్బులు ఎవ్వరికైనా మంచిది. పీచుపదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ..ఇందులో ఉండే స్పెషల్ పీచులు.డైజెషన్ సిస్టమ్ కు బాగా మేలు చేస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

ఆలుబుక్రాలో ముఖ్యంగా సార్బిటాల్, ఐసోటిన్ అనే ఫైబర్స్ ఇతర పీచులకు భిన్నంగా జీర్ణకోశంలో పనిచేసి జీర్ణకోశం కదలిలకలు పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయట. తక్కువ శక్తిని ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉండటంతో..జబ్బులు భారిన పడే రేటు తగ్గుతుంది. రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి ఆలుబుక్రా చాలా బాగా పనికొస్తుంది.

ఆలుబుక్రా వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..

ఈ పండువల్ల ఎక్కువ లాభం ఏంటంటే..అందరికీ ఈరోజుల్లో ఎముకల బలహీనత ఎక్కువగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల కాల్షియం సరిగ్గా ఒంటికిపట్టక ఎముకల గుల్లబారిపాడిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటివారి అందరికి..ఆలుబుక్రా రోజు పొద్దున 4-5 సాయంకాలం 4-5 తింటే మూడునెలల్లో బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుందని 2009వ సంవత్సరంలో ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ అమెరికా వారు పరిశోధన చేసి నిరూపించారు. ఎందుకు పెరుగుతుంది అంటే..ఆల్ బుక్రాలో మినరల్స్ తో పాటు ఇన్సులిన్ లైన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనేది ఉందట..ఇది బోన్ హెల్త్ ను పెంచుతుందట.

ఇందులో ఉన్న విటమిన్ c, ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ మన శరీరంలో ముఖ్యంగా లివర్ మీద బ్లడ్ లో బాగా పనిచేసి..ఫ్యాట్ మెటబాలిజంలో మంచి మార్పులు తీసుకొచ్చి, రక్తనాళాల్లో కొవ్వుపేరుకోకుండా, లివర్ లో కూడా ఫ్యాట్ పేరుకోకుండా..కాపాడుతూ..బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం బాగా జరుగుతుందట. కొవ్వు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుందని 1991లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటి వారు పరిశోధన చేసి ఇచ్చారు.

అల్బఖరా తినటం వల్ల జలుబు, దగ్గు వస్తాయా?

కొంతమందికి దంతాల పైన ఉండే ఎనామిల్ కోటింగ్ దెబ్బతిన్నప్పుడు ఈ పుల్లటి పండ్లు తిన్నప్పుడు..అందులో ఉండే ఎసిడిక్ నేచర్ కు ఇరిటేట్ అయి..పళ్లు జివ్వున లాగటం జరుగుతుంది. ఇలా అయ్యేసరికి..ఇక ఆహారం తినాలనిపించదు..ఇలాంటి వారు..ఈ పండుని ఒక సైడు మాత్రమే తింటే..మరోసైడ్..భోజనం చేసుకోవచ్చు. ఈ పండు తినేప్పుడు కాస్త తేనె వేసుకుని తిన్నా అంత పులుపు అనిపించదు.

ఈ పండ్లు తినటం వల్ల సీజనల్ గా వచ్చే..జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. కాబట్టి అపోహలు మాని..వీలైనప్పుడల్లా ఇలాంటి ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటే..ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈరోజుల్లో పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎముకలు బలహీనతతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ ఫ్రూట్స్ ను వీలైనప్పుడల్లా తినొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version