జుట్టు రాలిపోతుందా.. తలస్నానానికి ముందే కండిషనర్‌ పెట్టండి..!!

-

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దానికోసం.. ఎన్నో తంటాలు కూడా పడుతుంటారు. జుట్టుకు ఆయిల్‌ పెట్టడం, తలస్నానం చేయడంలో మీరు తప్పులు చేశారంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే..చాలా మంది ఈ రెండు విషయాల్లోనే తప్పులు చేస్తుంటారు. జుట్టు రాసే సమస్య నుంచి బయటపడాలంటే.. రివర్స్‌ షాంపూ ట్రై చేయండి.. రివర్స్‌ షాంపూ ఏంట్రా అనుకుంటున్నారా..?

రివర్స్ షాంపూ అంటే ఏంటి?

సాధారణంగా షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకుంటారు. అలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు సహజ నూనె, తేమ చెక్కుచెదరకుండా ఉంటుంది.. అయితే షాంపూ చేసుకునే ముందు కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడాన్ని రివర్స్ షాంపూ అని కూడా అంటారు. అలా చేస్తే షాంపూలోని కఠినమైన రసాయనాలు జుట్టులోకి ప్రవేశించలేవు.

రివర్స్‌ షాంపూ వల్ల లాభాలు..

ఇది జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. స్టైలింగ్ లేకుండానే మీ జుట్టు మీ మాట వినేస్తుంది. చక్కగా మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు.
నిస్తేజమైన, పేలవమైన జుట్టు ఉంటే షాంపూకి ముందు కండిషనర్ చక్కని పరిష్కారం. జుట్టు కడిగే ముందు దీన్ని అప్లై చేసుకుంటే నిగనిగలాడుతుంది.
వెంట్రుకలకు నూనె ఎక్కువగా ఉంటే కండిషనర్ పెట్టడం వల్ల దాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత షాంపూ చేస్తే శుభ్రంగా ఉంటుంది.
కండిషనర్ జుట్టుని ఫ్లాట్‌గా కనిపించేలా చేస్తే రివర్స్ షాంపూ చేస్తే జుట్టు జిడ్డుగా కనిపించదు. కానీ పోషణ మాత్రం అందుతుంది.
చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. తల దువ్వుకున్న ప్రతిసారి దువ్వెనలో అంతంత జుట్టు ఉంటుంది.. అలాంటి సమస్య ఉన్నవాళ్లు.. రివర్స్ షాంపూ ట్రై చేసి చూడండి. షాంపూకి ముందు కండిషనర్ పెట్టడం వల్ల తలస్నానం చేసేటప్పుడు జుట్టు గట్టిగా లాగడం, చిక్కు పడటం వంటివి జరగవు. దీని వల్ల జుట్టు సాఫ్ట్‌గా మారి చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
రివర్స్ కండిషనింగ్ వల్ల జుట్టు మరింత మెరిసేలా చేసేందుకు సహాయపడుతుంది. జుట్టు రెపరెపలాడిపోతుంది.
కండిషనర్ ముందుగా పెట్టడం వల్ల జుట్టుకు పట్టిన మురికి చాలా వరకు తొలగిపోతుంది. దీని వల్ల తక్కువ షాంపూ పడుతుంది. జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో షాంపూ పెట్టాల్సిన అవసరం ఉండదు.
జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది. హెయిర్ క్యూటికల్స్‌ని శాంతపరుస్తుంది. జుట్టుకి మరింత పోషణ అందిస్తుంది.
షాంపూకి ముందు కండిషనర్ చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న రంధ్రాలను అన్ లాగ్ చేస్తుంది. జుట్టునిహైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version