MGM సూపరింటెండెంట్​కు సమ్మెనోటీసు ఇచ్చిన పీజీ వైద్య విద్యార్థులు

-

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆమెను వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సైఫ్​కు మద్దతుగా వైద్య విద్యార్థులు ఎంజీఎం ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు.

సైఫ్​కు మద్దతుగా ఎంజీఎం ప్రధాన గేటు వద్ద పీజీ వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్​కు సమ్మె నోటీసు ఇచ్చారు. సైఫ్​కు మద్దతుగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్​పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కోఠిలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నాకు దిగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతి ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణమైన సైఫ్​ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version