ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయా..? అయితే వారు జీనియస్..!

-

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా పెంచాలని.. కావాల్సినవన్నీ కొని ఇవ్వాలని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు బాగా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. వెంటనే ఏదైనా సరే పట్టుకుంటారు. మీ పిల్లలు కూడా జీనియస్ అని అనుకుంటున్నారా? ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే కచ్చితంగా వాళ్ళు జీనియస్ అని చెప్పొచ్చు. పిల్లలు జీనియస్ అని ఎలా చెప్పచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఏ పిల్లలైతే త్వరగా మాట్లాడతారో వాళ్ళు జీనియస్ అని చెప్పొచ్చు. వాళ్ళు పదాలు, వాక్యాలు కూడా చాలా వేగంగా మాట్లాడగలుగుతారు. తక్కువ వయసులోనే ఇవన్నీ నేర్చుకుంటారు. అలాగే చదువుకోవడం, రాయడం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే కచ్చితంగా వాళ్ళు బ్రిలియంట్ అని చెప్పొచ్చు. జీనియస్ అని అనొచ్చు.

పదేపదే ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. తెలియని విషయాలు నేర్చుకోవడంలో ఆత్రుత ఎక్కువ చూపిస్తుంటే వాళ్ళ మెదడు బాగా పనిచేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. దేనినైనా త్వరగా క్యాచ్ చేస్తుంటే కూడా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఏ విషయాన్ని మర్చిపోకుండా త్వరగా రీ కాల్ చేసుకున్నట్లయితే కూడా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విషయాన్నైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఎనలైజ్ చేస్తుంటే కూడా వాళ్లలో తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ కి క్రియేటివ్ సొల్యూషన్స్ ఇస్తున్నట్లయితే కూడా వాళ్ళు జీనియస్ అని చెప్పొచ్చు.

పజిల్స్ వంటివి వేగంగా సాల్వ్ చేస్తుంటే కూడా వాళ్ళు జీనియస్ అని మనం అనొచ్చు తెలివైన పిల్లలు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తూ ఉంటారు. తెలివైన పిల్లలు ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటారు. ఏ పిల్లలైతే చిన్నవయసులో మ్యాథమెటిక్స్ పై ఆసక్తి చూపిస్తారో వాళ్ళు జీనియస్ అని అనొచ్చు. ఎమోషన్స్ ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. తెలివైన పిల్లలు ఎప్పుడూ కూడా ఇతరులు పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version