పురాతన కాలం నుండి కూడా ఆలివ్ ఆయిల్ ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యేకమైన వంటల్లో దీనిని పెద్ద పెద్ద చెఫ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం.
గుండె ఆరోగ్యం:
ఆలివ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది రక్త ప్రసరణను మరింత మెరుగు పరిచి గుండె పోటును మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తుంది.
జ్ఞాపక శక్తి:
జ్ఞాపక శక్తి కోసం ఆలివ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. అలానే సెరోటోనిన్ యొక్క స్థాయిని పెంచుతుందని అంటారు. సెరోటోనిన్ అనేది ఆనందాన్ని కలిగించే హార్మోన్ గా కూడా పిలుస్తారు. ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలానే మానసిక స్థైర్యాన్ని కూడా ఇది పెంచుతుంది.
షుగర్ ని తగ్గిస్తుంది :
ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల షుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. టైప్2 డయాబెటిస్ వల్ల రక్తం లో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని ఇది మరింత మెరుగు పరుస్తుంది.
చర్మ ఆరోగ్యం :
ఆలివ్ ఆయిల్ లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. శరీరానికి పునరుజ్జీవనాన్ని కూడా ప్రసాదిస్తుంది. ముడతలు రాకుండా కూడా సహాయపడుతుంది.