వయసు మీదపడడంతో పీరియడ్స్‌ ఆగిపోతాయి. ఇందుకు సంతోషించాలా? బాధపడాలా?

-

అందుకేనేమో చిన్నపిల్లలు, వృద్ధులు సమానం అంటారు. చిన్న వయసులో పీరియడ్స్‌ రావు. అలాగే 40 ఏండ్లు దాటగానే పీరియడ్స్‌ కూడా ఆగిపోతాయి. దీంతో వారికి వీరికి పెద్ద తేడా ఉండదు. 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ మెనోపాజ్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే.. అదే సమయంలో ఎన్నో శారీరక సమస్యల్ని మహిళలు అధిగమించాల్సి ఉంటుంది. అసలు మెనోపాజ్‌ అంటే ఏంటి. దీని నుంచి బయట పడడం ఎలానే తెలుసుకుందాం.

 

పీరియడ్స్‌ సమయంలో మహిళలు భయంకరమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఆ నొప్పి భరించేలేక పీరియడ్స్‌ రాకుండా ఉంటే బాగుంటుంది. అనుకుంటాం. కానీ, అలా జరిగితే అంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఉండదు సుమా. ఆ దేవుడు మాతృత్వాన్ని మహిళకు మాత్రమే ఇచ్చాడు. దీన్ని భారంగా స్వీకరించకూడదు. దీనివల్లే మనం అమ్మ అవ్వగలం అని గుర్తుపెట్టుకోండి. అలా అనుకుంటే ఎంతటి నొప్పినైనా హాయిగా భరించవచ్చు. ఇది ఎంతో కాలం ఉండదు. ఏండ్లు గడిచేకొద్ది పీరియడ్స్‌ తగ్గుముఖం పడతాయి. సుమారు 40 ఏండ్లు వచ్చేసరికి ఆ సమయం రానే వస్తుంది. దీంతో కొంతమొత్తంలో హ్యాపీగా ఫీలయినా కొంచెం బాధపడే విషయమే. పీరియడ్స్‌ వస్తే ఏమవుతుంది. ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుంటే మంచిది.

మెనోపాజ్‌ అంటే ఏంటి?

అప్పుడే యుక్తవయసుకి వచ్చే అమ్మాయిలు శరీరంలో వచ్చిన మార్పులని చూసి మురిసిపోతారు. అవి అలాగే కొనసాగి మాతృత్వానికి దారితీస్తాయి. అయితే.. అవి ఊరికే జరగవు కదా.. వాటి వెనుక ఓ రహస్యముంది. అవే హార్మోన్స్‌. వాటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌లు. ఇవి యుక్త వయసులో అమ్మాయిల్లో చేరి గిలిగింతలు పెట్టి.. వయసు దాటిపోగానే.. రిలాక్స్‌ అవుతుంటాయి. ఫలితంగా రుతుక్రమం అగిపోతుంది. దాన్నే మోనోపాజ్‌ అంటారు. ఆ సమయంలో ఎన్నో శారీరక సమస్యలు మహిళలకు ఇబ్బందులు పెడతాయి.

జాగ్రత్తలు :

– పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి.

– కాఫీ, టీ, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

– వ్యాయామం చేయడం కూడా ఎంతో ముఖ్యం.

– షుగర్‌ ఉంటే గనుక ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

– బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.

– ప్రతి ఆరునెలలకోసారి హెల్త్‌ చెకప్స్‌ తప్పనిసరి.

– అధిక రక్తస్రావం గుండె వేగంగా కొట్టుకోవడం, వైట్‌ డిశ్చార్జ్‌ ఎక్కువగా అవుతుండడం వంటివి అవుతుంటే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

– మీ సమస్యను బట్టి డాక్టర్స్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు.- యోని భాగం ఎక్కువగా పొడిగా అయి ఇబ్బంది పెడుతుంటే.. ట్యూబ్రికెంట్స్‌ వాడాలి. దాంతో ప్రయోజనం లేకపోతే.. వేజినాల్‌ ఈస్ట్రోజెన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి.- ఈ సమయంలో సోయా పాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version