అయోడిన్‌ లోపిస్తే ఆరోగ్యానికి మంచిదేనా.. నిత్యం ఎంత అయోడిన్‌ అవసరం..।

-

అయోడిన్‌ అనగానే అందరికీ ఉప్పు మాత్రమే గుర్తుకు వస్తుంది. ఉప్పులో అయోడిన్‌ ఉంటుంది. అయోడిన్‌ వల్ల బ్రెయిన్‌ పవర్‌ బాగుంటుంది అనుకుంటాం.. ఉప్పులో మాత్రమే అయోడిన్‌ ఉండదు..ఇంకా చాలా వాటిల్లో ఉంటుంది. కాబట్టి ఈ కారణంతో ఉప్పును అధికంగా వాడొద్దు. మన శరీరానికి కావాల్సిన మినరల్స్‌లో అయోడిన్‌ కూడా ఒకటి. దీన్ని నిత్యం మనం తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయోడిన్‌ వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని మన శరీరం నిత్యం ఉపయోగించుకుంటుంది.

అయోడిన్‌ ఉపయోగాలు

  • మన శరీరంలో థైరాయిడ్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉండేందుకు, ఆ గ్రంధి సరిగ్గా పనిచేసేందుకు అయోడిన్‌ చాలా అవసరం.
  • గర్భంలో ఉన్న శిశువు నాడీ మండల వ్యవస్థ ఎదుగుదలకు, పుట్టే పిల్లలు సరైన బరువును కలిగి ఉండేందుకు, స్త్రీలలో వక్షోజాల సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలన్నా, బాక్టీరియా, వైరస్‌ల నుంచి మనకు రక్షణ కల్పించేందుకు.. అయోడిన్‌ అవసరం అవుతుంది.

నిత్యం మనకు అయోడిన్‌ ఎంత మోతాదులో కావాలి..

  • అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 6 నెలల వయస్సు వారికి రోజుకు 110 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం అవుతుంది.
  • 7 నుంచి 12 నెలల మధ్య వయస్సు వారికి రోజుకు 130 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • 1 నుంచి 8 ఏళ్ల వయస్సు వారు నిత్యం 90 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి.
  • 9 నుంచి 13 ఏళ్ల వారికి 120 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • 14 ఏళ్లు అంతకన్నా పైబడిన వారు 150 మైక్రోగ్రాముల అయోడిన్‌ను నిత్యం తీసుకోవాలి.
    గర్భిణీలకు నిత్యం 220 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం.
  • పాలిచ్చే తల్లులు నిత్యం 290 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

అయోడిన్‌ లోపం లక్షణాలు ఇవే..

  • శరీరంలో అయోడిన్‌ లోపిస్తే మెడ దగ్గర వాపు కనిపిస్తుంది.
  • థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురై టచ్‌ చేస్తే నొప్పి అనిపిస్తుంది.
  • శ్వాస తీసుకోవడంలో, నిద్రించడంలో ఇబ్బందులు వస్తాయి.
  • మింగడం కష్టమవుతుంది.
  • తీవ్రమైన అలసట ఉంటుంది.
  • సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ బాగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
  • వెంట్రుకలు రాలిపోతుంటాయి.
  • డిప్రెషన్‌గు గురి అవుతారు.
  • అధికంగా బరువు పెరుగుతారు.

ఈ లక్షణాలు మీలో ఉంటే.. అయోడిన్‌ లోపం ఉన్నట్లే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఆ మేరకు చికిత్స తీసుకోవాలి. అయోడిన్‌ లోపం ఉంటే వైద్యులు సప్లిమెంట్లు ఇస్తారు. అయితే అయోడిన్‌ను నిత్యం మోతాదుకు మించి తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వస్తాయి. వికారంగా, వాంతికి వచ్చినట్లు ఉంటుంది. విరేచనాలు అవుతాయి. జ్వరం వస్తుంది. గొంతు, నోరు మండినట్లు అనిపిస్తుంది. కడుపులో నొప్పి ఉంటుంది. అయోడిన్‌ సప్లిమెంట్లను వాడేవారు ఆయా లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.

అయోడిన్‌ ఉండే ఆహారాలు ఇవే..

సముద్రపు చేపలు, పెరుగు, కోడిగుడ్లు, క్రాన్‌ బెర్రీలు, బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, మొక్కజొన్న, ప్రూన్స్‌, అరటి పండ్లు, సాల్ట్‌, సోంపు గింజల ఆకు, సముద్రపు ఉప్పు, అయోడైజ్డ్‌ సాల్ట్‌, టర్కీ మాంసం, బీన్స్‌, పాలకూర, కొబ్బరినూనె, బ్రొకొలి, హిమాలయన్‌ తదితర ఆహారాల్లో మనకు అయోడిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అయోడిన్‌ లోపం బారిన పడకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version