చాలామంది రాత్రిపూట గురక పెడుతూ ఉంటారు. మీకు కూడా గురక వస్తుందా..? అయితే ఇలా చేయండి. గురక వలన మీకే కాదు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అల్లం వలన గురక సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. గొంతును క్లియర్ చేయడానికి అల్లం సహాయం చేస్తుంది. అలాగే వెల్లుల్లి కూడా గురక సమస్య నుంచి బయటపడేస్తుంది.
ఉల్లిపాయ గురక సమస్య నుంచి బయటపడడానికి సహాయం చేస్తుంది. ఉల్లిపాయని రసం చేసుకుని తీసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే కూడా గురక సమస్య తగ్గుతుంది. గురకని తగ్గించడానికి అరటిపండు కూడా తీసుకోవడం మంచిది. పైనాపిల్ తింటే కూడా గురక రాదు. ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
ఇవే కాకుండా గురక సమస్య నుంచి బయటపడడానికి నారింజ కూడా బాగా పనిచేస్తుంది. నారింజలో మెలటోనిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గురక రాకుండా చేస్తుంది. సోయా పాలు తీసుకుంటే కూడా రాత్రి బాగా నిద్ర పడుతుంది. గురక నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రి నిద్ర పోవడానికి ముందు ఆలివ్ ఆయిల్ తాగితే శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. గురక రాదు. మరి ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వీటిని తీసుకోండి. గురక సమస్య నుంచి బయటపడండి. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.