మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ మీద అవినీతి ఆరోపణలు చేసారు వికలాంగుల సహకార సంస్థ ఛైర్మెన్ వీరయ్య. బీఆర్ఎస్ హయంలో వికలాంగుల సంక్షేమం శాఖలో భారీ అవినీతి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు కొప్పుల ఈశ్వర్ వికలాంగుల శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. శాఖ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఉద్యోగులను ఆసరాగా చేసుకొని మాజీ మంత్రులు అవినీతి చేసారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వికలాంగులకు అందించే ట్రై మోటార్ స్కూటర్లు అనర్హులకు ఇచ్చారు. ఇచ్చిన మోటార్ స్కూటర్ల వివరాలు పోర్టల్ లో ఉండదు. హరీష్ రావు ఉద్దేశ పూర్వకంగానే తన వారికీ ప్రమోషన్లు ఇచ్చారు. సహకార సంస్థలో తన వారికి అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఉన్నతస్థాయి ప్రమోషన్ల విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఐఏఎస్ స్థాయి వ్యక్తి డైరెక్టర్ గా ఉండాలి కానీ ఎక్స్ అఫిషియో మెంబర్ కి ఇచ్చారు. వికలాంగులకు ఇచ్చే ట్రైనింగ్ సెంటర్లను బీ ఆర్ ఎస్ మూసేసింది. జరిగిన అవినీతి మీద విజిలెన్స్ , ఏసీబీ విచారణ చేస్తాము. 10 శాతం ఫైళ్లను మాత్రమే ఆడిట్ రిపోర్టుకు ఇచ్చారు. సరైన ఆడిట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచే నిధులు ఆగిపోయాయి అని ఆయన పేర్కొన్నారు.