నెల రోజుల పాటు అన్నం తినడం మానేస్తే షుగర్‌ తగ్గుతుందా..? నిపుణులు ఏం అంటున్నారు..?

-

సౌత్‌ ఇండియన్స్‌కు అన్నం లేకుండా అస్సలు కడుపునిండిన ఫీల్‌ రాదు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు. అన్నం తినకపోతే అసలు నిద్రేపట్టదాయే. కానీ ఇప్పుడు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఆ వైట్‌ రైస్‌ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు అంటే దంపుడు బియ్యం తినేవాళ్లు.. పెద్దగా ఏం ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పాలిష్‌ పట్టిన వైట్‌ రైస్‌ తింటన్నారు. ఇది చూసేందుకు పాష్‌గా ఉంటుంది కానీ లోపల ఏం ఉండదు. షుగర్‌ ఉన్నవాళ్లు ఈ బియ్యం తింటే ఇంకా డేంజర్‌ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఒక నెల రోజుల పాటు కంప్లీట్‌గా రైస్‌ మానేస్తే ఏం అవుతుంది..? షుగర్‌ తగ్గిపోతుందా..? దీనిపై నిపుణులు ఇచ్చే సమాధానం ఏంటి..?

కేలరీలను తగ్గించడం ద్వారా బరువు నియంత్రణ

మీరు ఒక నెల పాటు అన్నం తినకపోతే, శరీరంలో కేలరీల పరిమాణం తగ్గుతుందని, ఇది ప్రధానంగా బరువు తగ్గడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తిననప్పుడు అది మన శరీరంలోకి వెళ్లదు. సహజంగానే ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరిస్తుంది.

షుగర్ ఒక్కసారిగా పెరగదు

మీరు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బియ్యం వంటి ఇతర ధాన్యాలను తింటే అది మీ బరువును తగ్గించదు. బ్లడ్ షుగర్ తగ్గే విషయానికొస్తే, మనం అన్నం తినకపోతే, అది తిన్న తర్వాత అకస్మాత్తుగా పెరిగే బ్లడ్ షుగర్ పెరగదని డైటీషియన్స్‌ అంటున్నారు. మీరు అన్నం తినే వరకు ఇది కూడా జరుగుతుంది. కానీ మీరు ఒక నెల తర్వాత అన్నం తినడం ప్రారంభించిన వెంటనే, మళ్లీ రక్తంలో చక్కెర అదే రకంగా ఉంటుంది.

అన్నం మానేయడం సరైన పరిష్కారం కాదు

చిన్నప్పుడు మనం అన్నం తినే పెరిగాం.. ఈరోజు సడన్‌గా నెల పాటు అన్నం లేకుండా ఉండటం మనతోని అయ్యే పని కాదు. అలా అని కఠినంగా ఉన్నా పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఏ రైస్‌ తినాలి, ఎంత పరిమాణంలో తినాలో తెలిసినప్పుడు ఎలాంటి సమస్యా రాదు. రోజులో ఒక్కపూట, రెండుపూట్లు అయినా తినొచ్చు. అయితే షుగర్‌ ఉన్నవాళ్లు రాత్రి కూడా అన్నం తినాలనుకుంటే ఏడు గంటల లోపే తినేయండి. ఆ తర్వాత నీళ్లు తప్ప ఎలాంటి ఆహారాన్ని తీసుకోకండి. రోజు తగిన వ్యాయామం, వాకింగ్‌ లాంటివి చేస్తుంటే మీకు ఎలాంటి సమస్యా రాదు.

అన్నం తినకపోతే మన శరీరంలో పీచుపదార్థం కూడా తగ్గిపోతుంది. ఇది మన జీర్ణక్రియ ప్రక్రియను మారుస్తుంది. మరోవైపు, పోషకాల విషయానికొస్తే, బియ్యంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, బి విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉన్నాయి. అందుకే దాని ప్రభావం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఒక నెలపాటు అన్నం తినకపోతే మన ఆరోగ్యం మెరుగుపడుతుందనేది అస్సలు నిజం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version