టీ లేదా కాఫీ… రెండింటిలో ఏది బెట‌ర్‌..? తెలుసుకోండి….!

-

కాఫీ అయినా టీ.. ఏదైనా స‌రే.. ఎన్ని క‌ప్పులు తాగినా వాటి ద్వారా మ‌న‌కు అందే కెఫీన్ ప‌రిమాణం నిత్యం 400 మిల్లీగ్రాముల‌కు మించ‌రాదు. అయితే రెండింటిలో ఏది తాగితే మంచిది..? అంటే..

మ‌నలో అధిక శాతం మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌గానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇక రోజులో కొంద‌రు ఎన్ని సార్లు కాఫీ, టీలు తాగుతారో లెక్కే ఉండ‌దు. కొంద‌రు మాత్రం కేవ‌లం ఉద‌యం, సాయంత్రానికే ప‌రిమిత‌మ‌వుతారు. ఇక కొంద‌రు ఉద‌యం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు తాగుతారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కేవ‌లం కాఫీకి మాత్ర‌మే ప్రాధాన్య‌త‌ను ఇస్తే.. కొంద‌రు మాత్రం కేవ‌లం టీ మాత్ర‌మే తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే బెట‌ర్‌..? దేని వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..? అంటే…

టీ, కాఫీల‌లో కెఫీన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంద‌ని తెలిసిందే. అయితే టీ క‌న్నా కాఫీలోనే ఎక్కువ‌గా కెఫీన్ ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం మ‌నం 400 మిల్లీగ్రాముల క‌న్నా ఎక్కువ‌గా కెఫీన్ తీసుకోరాదు. అంటే.. కాఫీ అయినా టీ.. ఏదైనా స‌రే.. ఎన్ని క‌ప్పులు తాగినా వాటి ద్వారా మ‌న‌కు అందే కెఫీన్ ప‌రిమాణం నిత్యం 400 మిల్లీగ్రాముల‌కు మించ‌రాదు. అయితే రెండింటిలో ఏది తాగితే మంచిది..? అంటే..

డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు ఉన్న‌వారు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం కాఫీ తాగితే మంచిది. వీలైతే వారు గ్రీన్ టీ తాగాలి. అలాగే ఉద‌యాన్నే ప‌ని భారం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకునే వారు కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అయి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. శ‌రీరానికి ఉత్సాహం, ఉత్తేజం క‌లుగుతాయి. దీంతో పెద్ద‌గా ప‌నిఉన్నా భారం అనిపించ‌దు. ఇక నిత్యం ఉద‌యాన్నే వ్యాయామం చేసేవారు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారు టీ తాగ‌డం బెట‌ర్‌. అలాగే అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు టీ తాగాలి. అయితే టీ, కాఫీ రెండింటి ద్వారా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ వాటిని నిత్యం ప‌రిమిత మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. రోజు 4 లేదా 5 చిన్న క‌ప్పులు ఫ‌ర్వాలేదు. అంతకు మించితే శ‌రీరంలో కెఫీన్ పెరిగిపోతుంది. దాంతో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా, కొత్త అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే.. టీ, కాఫీ ఏది తాగినా ఫ‌ర్లేదు. కానీ పైన చెప్పిన‌ట్లుగా కెఫీన్ మోతాదును చూసుకుని మ‌రీ తాగాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version