Beer side effects : బీర్ తాగడం వలన ఎన్ని నష్టాలు కలుగుతాయో మీకు తెలుసా..? చాలా మంది బీర్ తాగితే పలు బెనిఫిట్స్ ని పొందవచ్చని, బీర్ ఒక అలవాటుగా మారిపోయిందని అంటూ ఉంటారు. రాత్రిపూట బీర్ తాగడం వలన చాలా సమస్యలు కలుగుతాయి అని ఆరోగ్యని పనులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట బీర్ తాగితే ఇన్ని సమస్యలా అని అవాక్కవుతున్నారా..? అసలు రాత్రిపూట బీర్ తాగితే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
బీర్ వలన కలిగే నష్టాలు:
ప్రతిరోజు బీర్ తాగితే ముఖ్యంగా రాత్రిపూట రోజు బీర్ తీసుకోవడం వలన పెద్ద ప్రమాదం పొంచి ఉంది. లివర్ ఆల్కహాల్ లేదా బీర్ వంటి వాటిని బ్రేక్ చేస్తుంది. రోజు బీర్ తాగితే లివర్ పై లోడ్ ఎక్కువ పడుతుంది. పదేపదే ఇదే జరుగుతూ ఉంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. అధిక మోతాదులో రోజు రాత్రిపూట బీర్ తాగడం వలన ఇంఫ్లమేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ కారణంగా జాండీస్, కడుపునొప్పి, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు జరగొచ్చు. ఇలా రాత్రి పూట పదేపదే బీర్ తాగడం వలన లివర్ పై ఒత్తిడి పడుతుంది. లివర్ పనితీరు కూడా పాడవుతుంది. మీరు తాగాలనుకుంటే రోజులో ఏదో ఒకటి టైం లో తాగండి. రాత్రిపూట మాత్రం తీసుకోవద్దు. అది కూడా లిమిట్ గానే తీసుకోండి అధిక మోతాదులో తీసుకోవడం, రాత్రిపూట తాగడం అస్సలు మంచిది కాదు. ఈ పొరపాట్లు చేస్తున్నట్లయితే ఇకమీదట మానుకోండి లేదంటే అనవసరంగా లివర్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.