సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఎలా సోకుతుంది.. ప్రభావాలేంటి?

-

సెరిబ్రల్ పాల్సీ అనేది చిన్నారుల్లో పుట్టుకకు ముందే వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. దీనిపై చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల.. ఇదే వ్యాధితో చనిపోయారు. దాంతో ఈ వ్యాధి ఏంటి అనేది తెరపైకి వచ్చింది. అందరూ చర్చించుకుంటున్నారు. అంత డబ్బు ఉండి కూడా వ్యాధిని నయం చేయించుకోలేదంటే..అది అంత తీవ్రమైన వ్యాధా అనేది సామాన్యుల్లో మెదిలే ప్రశ్న..ఈరోజు మనం ఈ వ్యాధి ఏంటి, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి?

తల్లి గర్భంలో ఎదుగుతున్న బిడ్డ మెదడుకు.. ప్రాణవాయివైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే.. అది ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఆ బిడ్డకు ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలనే సెరిబ్రల్ పాల్సీ అంటారని వైద్యులు తెలిపారు.

ఇందులో ఉండే రకాలు

స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ..
ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ..
ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అని 3 రకాలుగా ఉంటుందట. ఒక్కో రకం సెరిబ్రల్ పాల్సీకి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి.

స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన చిన్నారులకు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురై.. కాళ్లు, చేతులు బిగుసుకుపోతాయి. కదలికలు కష్టమవుతాయి.

ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన చిన్నారుల్లో.. సంబంధం లేకుండా శరీర కదలికలు ఉంటాయట

ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన వారికి గ్రహణ శక్తి తగ్గిపోతుంది. చిన్నారి శరీర ఎదుగుదలలో బ్యాలెన్స్ తప్పుతుంది.

ఈ మూడు రకాల సెరిబ్రల్ పాల్సీ లక్షణాల్లో.. ఏదో ఒకటే రకం సోకుతుందా అంటే.. అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి రెండు లేదా మూడు రకాలు కలిసి కూడా చిన్నారులకు వ్యాధి సోకే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఫిజియోథెరపీ వంటి వాటితో కాస్త ఉపశమనం కలిగించవచ్చే తప్ప.. సెరిబ్రల్ పాల్సీ సోకిన వారికి పూర్తి స్థాయి చికిత్స.. పూర్తి స్థాయి రోగ నివారణ కష్టమే అన్న అభిప్రాయాలు కూడా వైద్యుల్లో ఉన్నాయి. ఈ విషయంలో బాధిత చిన్నారుల గురించి కుటుంబ సభ్యులు పూర్తి అవగాహన పెంచుకుని.. అందుకు అనుగుణంగా ఇంట్లో వాతావరణం కల్పించడం మంచిది.

ఈ అరుదైన వ్యాధి సోకి కన్నుమూసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల పరిస్థితికి వస్తే.. ఆయనకు కూడా పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి ఉన్నట్టు నాదెళ్ల కుటుంబీకులు తెలిపారు. ఆయన సరిగా నడవలేడు. చూడలేడు. సరిగా మాట్లాడలేడు. అలా 26 ఏళ్ల జీవితాన్ని.. పూర్తిగా వీల్ చైర్ లోనే గడిపారు.

సెరిబ్రల్ పాల్సీ రాకుండా తీసుకునే జాగ్రత్తలు

పుట్టిన తర్వాత పిల్లలలో సెరిబ్రల్ పాల్సీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, తల్లిదండ్రులు తమ బిడ్డకు అన్ని సాధారణ శిశు ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన టీకాలు వేయించారో లేదో నిర్ధారించుకోవాలి. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి.

ఒక్కోసారి సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బాల్యంలో తలకు గాయాలవడం వల్ల కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో ఏర్పడే సమస్యల వల్ల కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన సెరిబ్రల్ పాల్సీని నివారించవచ్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

శిశువులో గమనించాల్సిన లక్షణాలు..

ఆర్నెల్లు దాటిన చిన్నారి మెడ నిలపలేకపోయినా, 3 నెలలు దాటినా చూడలేకపోతే, 4-6 నెలల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్ వస్తుంటే ఎదుగుదల లేకపోతే.. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. శారీరక కదలికలు తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది. ఫిట్స్ వస్తుంటే దానికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది.

గర్భంలో ఉన్నప్పుడు ప్రతి మహిళ సరైన పోషకాలు ఉన్న ఆహారం, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. బిడ్డ కడుపులో ఉన్న తొమ్మిదినెలలో భూమిమీద పడిన తర్వాత వారి జీవితాన్ని శాశిస్తాయి. ఆ తొమ్మిదినెలలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో..వారి జీవితం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. తినే ఆహారంలో అనేక లోపాలు ఉంటే రేపు పుట్టోబిడ్డలో కూడా అన్నే లోపాలను చూడక తప్పదు. కాబట్టి ప్రతి స్త్రీ గర్భం దాల్చినప్పుడు తనకు నచ్చినానచ్చకున్నా శిశువుకు కావాల్సిన పోషకాలను ఆహారం రూపంలో అందించాలని వైద్యులు చెబుతున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version