హైదరాబాదులోని హబ్సిగూడ లో నలుగురు కుటుంబ సభ్యులు… ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఇద్దరు పిల్లలను చంపిన భార్యాభర్తలు ఆ తర్వాత ఉరేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే… ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో దారి లేక చనిపోతున్నాం.. క్షమించండి అంటూ.. చనిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో సూసైడ్ లేఖ కలకలం రేపింది.
ఇద్దరు పిల్లలను చంపి.. తాము ఉరేసుకుంటున్నట్లు తెలిపారు. మా చావుకు ఎవరు కారణం కాదు.. కెరీర్ అలాగే మానసికంగా అటు శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. వేరే మార్గం లేక చనిపోతున్నాం.. క్షమించండి అంటూ సూసైడ్ రాశారు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. చనిపోయిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వాన్ ఐదో తరగతి… చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన హబ్సిగూడ ప్రాంతంలో కలకలం రేపుతోంది.