వేగస్ మిల్క్ అంటే ఏంటి? ఎలాంటి మొక్కల నుంచి వీటిని సేకరిస్తారంటే..!

-

కొంతమందికి పాలంటే అస్సలు పడదు. ఆ వాసన చూస్తేనే ఎలర్జీ లెక్క ఫీల్ అవుతుంటారు. పాలంటే జంతువుల నుంచే కాదు మొక్కల నుంచి కూడా తీసుకోవచ్చు తెలుసా..శాకాహార పాలుగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. వీటిని వేగన్ పాలు అంటారు. జంతువుల నుంచి తీసిన పాలలానే రంగురుచి, లక్షణాలు పోలి ఉంటాయి. ఈ పాల గురించి ఈరోజు కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లాక్టోస్​ తక్కువగా ఉండాలనుకునే వారికి లేదా జంతువుల పాలంటే అలర్జీ ఉన్నవారికి ఈ పాలు చక్కటి ఎంపిక. జంతువుల పాల ఉత్పత్తులకు ఈ వేగన్ పాలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే వీటిని ఎలాంటి మొక్కలనుంచి తీసుకుంటారంటే…

రైస్​ మిల్క్​

లాక్టోస్ అలర్జీ ఉన్నవారికి రైస్​ మిల్క్ మంచి ఛాయిస్. ఈ పాలలో కార్బోహైడ్రేట్లలో అధికంగా లభిస్తాయి. కానీ కొవ్వు, ప్రోటీన్, ఇతర పోషకాలు కాస్త తక్కువగా ఉంటాయి. రైస్​ మిల్క్​ టీ, కాఫీలో వాడటానికి మంచి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. కానీ ఓట్ మీల్, సూప్, సాస్‌లలో వీటిని ఉపయోగించవచ్చు. ఇవి తియ్యటి రుచి కలిగి ఉంటాయి.

సోయా మిల్క్

సోయా మొక్కల నుంచి సోయా పాలు సేకరిస్తారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఈ పాలలో ప్రోటీన్, పొటాషియం, ఐసోఫ్లేవోన్‌లు పుష్కలంగా లభిస్తాయి.

బాదం మిల్క్​

మార్కెట్​లో లభించే మరో శాకాహార పాలు బాదం పాలు. బాదం మిల్క్ అంటే అందరికి ఇష్టమే..చాలా రుచిగా కూడా ఉంటాయి కదా. ఇవి సోయా పాలతో పోలిస్తే చాల మృదువుగా, సున్నితంగా ఉంటాయి. వీటిలో విటమిన్స్ డి, ఈ,కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

కాషూ మిల్క్​

కాషూ మిల్క్​ వంట, బేకింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఎక్కువగా అసంతృప్తి కొవ్వును కలిగి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తమ కొవ్వు తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పనిచేస్తాయట. మకాడమియా, అవిసె, బఠానీ ప్రోటీన్, అరటి, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, వోట్, హాజెల్ నట్, పొద్దుతిరుగుడు నుంచి తయారైన పాలు.. వీటికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.

కోకొనట్​ మిల్క్​

కొబ్బరి నుంచి తీసే పాలను కొబ్బరి పాలు అంటారు. కొబ్బతిపాలతో చేసే వంటలు కూడా భలే రుచిగా ఉంటాయి. బేకింగ్ చేయడానికి కూడా ఈ పాలను ఉపయోగించవచ్చు. ఈ పాలలో ఎక్కువ ప్రోటీన్లు లేనప్పటికీ, విటమిన్ డి, బి 2, బి 12, కాల్షియం వంటివి మాత్రం లభిస్తాయి.

జంతువులు నుంచి వచ్చే పాలను ఇష్టపడిని వారు..వీటిల్లో ఏదేని వేగన్ పాలను మీ డైట్ లో భాగం చేసుకోవచ్చు. పోషకవిలువలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version