ఇంట్లో వట్టి కాళ్లతో ఎందుకు నడవకూడదు..? ఈ సమస్యలు వస్తాయా..?

-

చెప్పులు వేసుకోకుండా నడవడం వలన ఎన్నో లాభాలు ఉంటాయని మనకి తెలుసు. అయితే ఇంట్లో కచ్చితంగా చెప్పులు వేసుకుని నడవాలని కొంతమంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంటి లోపల చెప్పులు వేసుకుని నడవకపోవడం వలన పలు సమస్యలు వస్తాయట. ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వలన కొన్ని సమస్యలు వస్తాయని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. నిజానికి వట్టి కాళ్లతో నడవడం వలన చాలా లాభాలు ఉంటాయి. ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడిస్తే పలు ప్రయోజనాలను పొందడానికి అవుతుంది.

అయితే ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వలన కొన్ని సమస్యలు వస్తాయట. కొన్ని పదునైన వస్తువులు కాళ్ళకి గుచ్చుకోవడం వలన కాళ్ళకి గాయాలు అవడం, పుండ్లు పడడం లేదంటే కాళ్ళు కట్ అవ్వడం వంటివి జరుగుతాయి. కొన్ని కొన్ని సార్లు మన ఇంటి ఫర్నిచర్ ని మనం చూసుకోకుండా తగులుకుంటూ ఉంటాము. వాటి వలన కూడా పాదాలకు గాయాలు అవుతాయి. కేవలం ఫిజికల్ గా గాయాలు మాత్రమే కాదు. ఇతర సమస్యలు కూడా వస్తాయి.

చెప్పులు లేకుండా నడవడం వలన నేలపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, పాథోజెన్స్, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులకు సంబంధించిన చర్మం లేదా పుప్పడి వంటి ఎలర్జీ కారకాలు సమస్యలకు తీసుకొస్తాయి. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తాయి. ఇంట్లో వట్టి కాళ్లతో నడవడం వలన పగుళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాస్త గట్టిగా ఉండే నేలపై లేదంటే నడవలేని చోట వట్టి కాళ్ళతో నడవడం వలన పగుళ్ళు ఏర్పడతాయి. పాదాలు పగిలిపోవడం వలన ఫంగస్ బ్యాక్టీరియా వలన కలిగే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version