అచ్యుతాపురం ప్రమాదం.. నష్ట పరిహారం కంపెనీ భరిస్తుంది..!

-

అచ్యుతాపురం ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎసెన్షియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమ. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయమని అదేశించాము. వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లో జన్ కారణంగా ప్రమాదం జరిగింది. SOP ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్ధం అవుతుంది.

LG పాలిమర్స్ ప్రమాదకర వాయువు. ఇప్పుడు జరిగింది అధికంగా పేలుడు స్వభావం కలిగింది. అందుకే భారీ నష్టం జరిగింది. LG పాలిమర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన కఠిన చర్యలు అమలు చేయలేదు. రెడ్ క్యాటగిరీ పరిశ్రమలు మరింత జాగ్రత్తలు పాటించాలి. ప్రతీ పరిశ్రమ ఇంటర్నల్ ఆడిట్ చేయాల్సిందే. ఈ ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేస్తాం. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తాం. నష్ట పరిహారం మొత్తం కంపెనీ భరిస్తుంది. అయితే యాజమాన్యం ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయింది. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కానీ అంత కంటే ముందు భద్రత చాలా అవసరం అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version