ఈ రోజు ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది..

-

  1. జూలై 3 ఆదివారం రాశి ఫలాలు… ఏ రాశి వారికి మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చుద్దాము.. 

మేషం: చేపట్టిన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మరింత శ్రమించాలి..ఈరోజు మిస్రమ ఫలితాలు లభిస్తాయి.

వృషభం: కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు.కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం..చికాకులు..స్వల్ప అనారోగ్యం..

మిథునం: సమాజంలో గౌరవం పెరుగుతుంది.. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం.

కర్కాటకం: ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. కృషికి తగ్గ ఫలితం దక్కదు.. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులు, కళాకారులకు కొంత ఒత్తిడులు.

సింహం: పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు. కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు.

కన్య: ప్రయాణాలు వాయిదా. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు అధికం. ఆదాయం తక్కువ వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు విశ్రాంతి లోపం.కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.

తుల: కొత్త పనులు విజయవంతంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో మంచిగా ఉంటారు. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఉత్సాహం.

వృశ్చికం: ఈరోజు కొత్త పనులు చేపడుతున్న వారికి మంచిది.. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: పనులలో ఆలస్యం దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ప్రముఖులతో చర్చలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. తీర్థయాత్రలు. సోదరులతో కలహాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.ఈరోజు మంచి ఫలితాలు..

మీనం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు..సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version