ధ్యానం: ఎలా మొదలు పెట్టాలి? ఎంతసేపు చేయాలి?

-

మానసిక ప్రశాంతత, స్థిరత్వం పొందడానికి ధ్యానం చాలా అవసరం. ఒకేదాని మీద దృష్టి నిలపడానికి కావాల్సిన శక్తి ఇవ్వడంతో పాటు మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. ఐతే చాలామంది ధ్యానం (Meditation) చేయాలని మొదలు పెట్టాలనుకునే వారు ఇబ్బందులు పడుతుంటారు. దృష్టి మొత్తం ఒకే దగ్గర కేంద్రీకరించడంలో విఫలం అవుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ధ్యానం ఎలా మొదలు పెట్టాలి? ఎంతసేపు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం.

ధ్యానం /Meditation

ధ్యానం ఎప్పుడు చేయాలి?

ఎప్పుడు పడితే వేళకాని వేళల్లో చేయాల్సింది కాదు. ప్రతీరోజూ ఒకే సమయానికి ధ్యానం చేయడం ప్రాక్టీసు చేయాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇతర ఆలోచనలు రానివ్వవద్దు. ధ్యానం మీదే దృష్టి నిలపండి. ఎంతసేపు చేయాలనేది ముందే నిర్ణయం తీసుకోండి. సరైన సూచనలు పాటించండి.

ధ్యానం సామర్థ్యం

ధ్యానం ఎంతలా చేస్తున్నారనే దానికి దాని సామర్థ్యం తెలుసుకోవాల్సి ఉంటుంది. ధ్యానంలో మాస్టర్ కావడం అంత సులభమైన విషయం కాదు. ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళడం అనేది శిఖరం లాంటిది. ప్రపంచంలో వెలువడే ఏ పెద్ద శబ్దం కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయని మనస్సు, ఆత్మ కలిసే అక్కడికి చేరుకుంటే ధ్యానంలో మాస్టర్ అయినట్టే.

ఎంతసేపు చేయాలి?

సాధారణ మానవులకు ధ్యానం అనేది ప్రతీ రోజూ ఒకే సమయం ఉండాలి. ఇవాళ అరగంట చేసి రేపు గంట చేయకూడదు. ప్రాక్టికల్ గా, వాస్తవికంగా మీకు సరిపోయే సమయంలో ధ్యానం చేసుకోవాలి. చేయాలన్నట్టుగా కాకుండా ఆనందంగా చేయాలి.

ధ్యానం రకాలు

ధ్యానం అనగానే పద్మాసనం వేసుకుని కూర్చోవడమే అనుకుంటారు. కానీ చాలా రకాలుగా ధ్యానం చేయవచ్చు.

నడుస్తూ ధ్యానం
చూస్తూ ధ్యానం
దృష్టి ధ్యానం మొదలగునవి ఇందులో రకాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version