చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటేనే మంచిదని.. అలాంటప్పుడే విజయాన్ని సాధించవచ్చు అని చాణక్య అన్నారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో విజయాన్ని అందుకోవాలని అనుకుంటారు. అలాగే గౌరవం, గుర్తింపు రావాలని అనుకుంటారు. మౌనం అనేది గొప్ప కళ. కొంతమంది ఎక్కువగా మాట్లాడటం వలన నష్టం కలుగుతుందని చాణక్య అన్నారు. అలాంటప్పుడు మౌనంగా ఉండటమే మంచిదని అన్నారు. ఎప్పుడైనా ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంటే అలాంటప్పుడు మధ్యలో రావడం మంచిది కాదని మాట్లాడటం మంచిది కాదని చాణక్య అన్నారు.
అలాగే ఎవరైనా వారి గొప్పతనం గురించి చెప్తున్నట్లయితే మౌనంగా ఉండటమే మంచిదని.. అలాంటప్పుడు మాట్లాడడం మంచిది కాదని చాణక్య అన్నారు. ఎవరికైనా మీ పై కోపం వస్తే ఆ కోపాన్ని మౌనంగా ఎదిరించాలని చాణక్య చెప్పారు. ఓ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు దాని గురించి మౌనంగా ఉండాలని చాణక్య అన్నారు. లేదంటే హాఫ్ నాలెడ్జ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీరు ఎంత చెప్పినా మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తిని కలిసినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. వారికి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా వారి సమస్యలను చెప్పుకుంటే జాగ్రత్తగా వినాలి తప్ప మాట్లాడకూడదు. ఏ విధంగా కూడా సంబంధం లేని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిదని చాణక్య అన్నారు. ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడటం కానీ కామెంట్ చేయడం కానీ మంచిది కాదని చాణక్య అన్నారు.