ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం: అంధుల లిపి కోసం కృషి చేసిన లూయిస్ బ్రెయిలీ…!

-

లూయిస్ బ్రెయిలీ పట్టుదల, కష్టానికి మెచ్చుకుని తీరాలి. ఆయన ఒకపక్క వైకల్యాన్ని జయించి తాను అనుకున్నది సాధించి… ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. అంధులకు ఆపద్భాంధవుడు లూయిస్ బ్రెయిలీ. మరి అటువంటి మహనీయుడి గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకుని తీరాలి కదా…! ఆలస్యం చేయకండి లూయిస్ బ్రెయిలీ గురించి, ఆయన జీవితం గురించి, బ్రెయిలీ దినోత్సవం గురించి ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

లూయిస్ బ్రెయిలీ జీవితం, కృషి:

లూయిస్ బ్రెయిలీ పారిస్‌ లోని క్రూవే గ్రామం లో 1809 జనవరి 4వ తేదీన జన్మించాడు. తాను 4వ ఏట ప్రమాదవ శాత్తు కంటి చూపుని కోల్పోయాడు. కంటి చూపు లేక పోయినా లూయిస్ బ్రెయిలీ లైన్ టైపు పద్దతి తో తాను విద్యాబ్యాసం చేసాడు. ఇలా లూయిస్ బ్రెయిలీ 17 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా అంధుల కోసం లూయిస్ బ్రెయిలీ సరళంగా చదువుకోవడం కోసం ఏదైనా చేయాలని పరితపించాడు. దీని కోసం పగలు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ, రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషి చేశాడు. తన కృషి తనని గెలిపించింది.

బ్రెయిలీ లిపిని రూపొందించడం:

1821లో చార్లెస్ బార్బియర్ అనే సైనిక అధికారి చీకట్లోనూ తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 చుక్కల సంకేత లిపిని తయారు చేసాడు. అయితే అది తెలుసుకున్న లూయిస్ 12 చుక్కలను ఆరు చుక్కలకు కుదించి అవసరమైన రీతి లో పేర్చుతూ చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించాడు. ఇదే బ్రెయిలీ లిపి.

ప్రపంచ బ్రెయిలీ దినోత్సం:

లూయీ బ్రెయిలీ పుట్టిన రోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సంగా జరుపుకోవడం జరుగుతుంది. అంధుల జీవితాల్లో వెలుగుల్ని నింపాడు ఈ వీరుడు. అంధులు అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తున్నారంటే దానికి గల కారణం లూయిస్ బ్రెయిలీ. దీని మూలంగానే అంధుల అక్షర శిల్పిగా వెలుగొందుతూనే ఉంటాడు. మన హృదయాల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version