టీ అమ్ముతూ రూ.25 లక్షల ట్యాక్స్… హైదరాబాద్ చాయ్ వాలా సక్సెస్ స్టోరీ చూస్తే శభాష్ అంటారు..!

-

టీ అంటే నిజంగా అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. చాలా మంది టీ తాగడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా బయట కూడా నచ్చిన చోట టీ తాగుతూ ఉంటారు. అయితే ఎక్కడైనా బయట టీ తాగాలంటే కొన్ని ప్రత్యేకమైన చోట్లు ఉంటాయి. అలాంటిదే నీలోఫర్ కేఫ్. నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు.

హైదరాబాదులో చాలా కాలం నుండి నీలోఫర్ చాయ్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పుడూ కూడా ఆ చాయ్ దుకాణంలో జనం ఎక్కువ గానే ఉంటారు. బాబురావు తాను నెలకు కట్టే జిఎస్టి ఏ 25 లక్షల వరకు ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా ఆ చాయ్ దుకాణం లో 690 మంది పని చేస్తున్నారు. వాళ్ళకి రోజు భోజనం కి మూడు లక్షలు అవుతుంది. అయితే నిజానికి బాబురావు ఈ టీ దుకాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా టీ ఉంటే బాగుంటుంది అనేది బాగా ఆలోచించి ఆ విధంగా తయారు చేశారు.

నిజానికి ఈయన కట్టే జిఎస్టి నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటే టర్నోవర్ ఎంత ఉంటుందో చూసుకోండి. పైగా బాబురావు మనసు ఎంతో విశాలమైనది. పేద వాళ్లకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. టీ షాప్ లో మిగిలిన బ్రెడ్, బిస్కెట్లను పేదవాళ్ళకి పంచుతూ ఉంటారు. ప్రస్తుతం రోజుకు 500 మందికి టిఫిన్స్, 300 మందికి భోజనాన్ని అందిస్తున్నారు.

పేదవాళ్లు అడగ్గానే కాదనకుండా సహాయం అందిస్తారు. అయితే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బాబురావు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. నష్టాలలో ఉన్న నిలోఫర్ కేఫ్ ని ఆయన కాంట్రాక్టుకు తీసుకుని మంచిగా లాభాలను సంపాదించడం మొదలు పెట్టారు. చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డ బాబురావు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మెచ్చుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version