పర్యావరణం పై ప్రేమతో.. పాత పేజీలకు కొత్త రూపాన్ని ఇస్తున్న బెంగుళూరు విద్యార్థి 

-

ఈ జనరేషన్ పిల్లలు బాగా తెలివైన వారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సమాజంపై అవగాహన, పర్యావరణం పై మక్కువ ఉంటుంది. ఇదే తరహాలో.. 17 ఏళ్ల దియా.. పర్యావరణం పై ఇష్టంతో కొత్త ప్రయత్నానికి నాంది పలికింది. మనం చదువుకునేప్పుడు.. చాలా సార్లు ఇయర్ ఎండింగ్ కు వచ్చేసరికి కొన్ని నోట్ బుక్స్ లో ఖాళీ పేజీలు ఉండిపోతాయి. వాటిని తిరిగి వాడం. మహా అయితే రఫ్ నోట్ బుక్స్ గా ఒకటి రెండు వాడతాం.. చాలా వరకూ పడేస్తుంటారు. అలా మిగిలిన పేజీలనే బుక్స్ లా మార్చి పేదపిల్లలకు అందిస్తోంది రియా..
బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల దియా అక్కడి కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతోంది. పర్యావరణ పరిరక్షణ అంటే ఆమెకు మక్కువ. మనం ఉపయోగించిన నోట్‌బుక్స్‌లో ఆఖర్లో కొన్ని తెల్లపేజీలు మిగిలిపోతుంటాయి. అయితే అవి ఇక పనికిరావంటూ పడేస్తుంటారు చాలామంది. కానీ తనకు మాత్రం అవే కావాలంటోంది దియా. అలాంటి పేజీల్ని సేకరించి.. తిరిగి వాటిని బైండ్‌ చేసి నోట్‌బుక్‌లా తయారుచేయిస్తోందామె. వాటిని పేద విద్యార్థులకు అందిస్తోంది.
అలా ఇప్పటివరకు 750 నోట్‌బుక్స్‌ని 200 మంది పేద పిల్లలకు పంచిపెట్టింది. దీని గురించి దియా మాట్లాడుతూ.. ‘పూర్తిగా వాడని నోట్‌బుక్స్‌ని తిరిగి ఉపయోగించడం వల్ల చెత్తను తగ్గించవచ్చు. తద్వారా పర్యావరణానికీ మేలు జరుగుతుంది. అలాగే ఆ పుస్తకాలను పేద విద్యార్థులకు అందించడం వల్ల వారికి కాస్త సహాయం చేసినట్లు అవుతుంది అంటోంది దియా. తీరిక సమయం దొరికినప్పుడల్లా పాత నోట్‌బుక్స్‌ని సేకరిస్తుందట. ఈ ఆలోచనలను మరింత మందితి తెలియచేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటుందట. పూర్తిగా వాడని, కొద్దిగా ఉపయోగించిన నోట్‌ బుక్స్‌ని సేకరించడానికి తన పరిసర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల దగ్గర డ్రాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసింది. తోటి విద్యార్థుల దగ్గర కూడా ఇలాంటి నోట‌్‌బుక్స్‌ని సేకరిస్తుందట.
 దియా తన స్కూల్‌ వర్క్‌లో భాగంగా పర్యావరణహితమైన ఓ ప్రాజెక్ట్‌ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే నోట్‌బుక్‌ రీబైండింగ్‌ని ఎంచుకుంది. అయితే తనకు ఈ ఆలోచన తన తల్లిని చూశాకే కలిగిందట. వాళ్ల అమ్మ సరుకుల జాబితా రాయడం దగ్గర్నుంచి ఇంటి ఖర్చుల లెక్కలు వేయడం వరకు.. ఇలా ప్రతి పనికీ ఉపయోగించిన నోట్‌బుక్స్‌లో ఉన్న ఖాళీ పేపర్లనే వాడేది. ఇది చూశాకే నాకు రీబైండింగ్‌ ఆలోచన వచ్చిందంటోది రియా.
దియా చేసి పనిని అందరూ ప్రశంసించారు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇలాంటి ఆలోచన రావడమే మంచి విషయం అంటే.. దాన్ని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడం ఇంకా గొప్ప విషయమే కదా. !
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version