ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని చర్చించుకున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. కొమురం భీమ్ వర్ధంతి, జయంతులను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశిస్తున్నా.
ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయండి. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ను క్లియర్ చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోండి అని తెలిపారు.ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు సీఎం.