మీకు సరిగ్గా నిద్రపట్టడం లేదా..? మీ మంచంలో ఈ తప్పులు ఉన్నాయేమో..!

-

Insomnia: నిద్ర పోవడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. కానీ ఏం చేస్తాం.. ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రరాక, నిద్రపట్టక, నిద్రలేక అమ్మో ఆ టార్చర్‌ మరీ..! మీకు నిద్రరాకపోవడానికి ఒత్తిడి, ఆందోళన ఒక కారణం అయితే.. మీరు పడుకునే మంచ కూడా ఒక కారణం తెలుసా..? మా మంచానికి ఏమైంది.. బానే నీట్‌గా ఉంది అనుకుంటున్నారా..? మీ మంచం ఎంత బాగున్నా.. మీలో కానీ ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ పరుపును మార్చాల్సిందే అంటున్నారు నిపుణులు..!

Insomnia

 

మీ శరీరంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఉదయం నిద్ర లేవగానే, మీ చేతులు, కాళ్ళలో నొప్పిగా ఉంటుంది. ఇలా రోజూ జరిగితే మీ పరుపు దాని సామర్థ్యాన్ని కోల్పోయిందని అర్థం చేసుకోవాలి.. ఇది మీ వెన్నెముక సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల చుట్టూ ఒత్తిడి.. తరచుగా వెన్నెముక సమస్యలు రావొచ్చు. ఇలా జరిగితే నిద్ర పట్టదు. మీరు తరచుగా మేల్కొంటారు.మీ శరీరానికి పరుపు సరిపోకపోతే సమస్యలు వస్తాయి. అన్ని పరుపులు అందరికీ సరిపోవు. మెత్తగా ఉంటే సరిపోదు. చిన్న పిల్లలకు, యువకులకు, వృద్ధులకు, వారి వయస్సును బట్టి పరుపును ఎంచుకోవాలి. అధిక బరువు ఉన్నవారు కూడా చాలా చిన్నగా ఉండే పరుపులను ఉపయోగించకూడదు. యువకులు సాధారణంగా అన్ని రకాల పరుపులకు అనుగుణంగా ఉంటారు. కానీ వృద్ధులు, పిల్లలు పడుకునే మంచంపై శ్రద్ధ వహించాలి.

ఎన్ని ఏళ్లు అవుతుంది పరుపు తీసుకోని..

ఇప్పటికే పరుపు తీసుకుని 8 ఏళ్లు అయితే.. మీరు కచ్చితంగా మార్చాల్సిందే.. చూడ్డానికి బానే ఉంది కదా అని లైట్‌ తీసుకోకండి..కొన్నిసార్లు మంచం ఏ పదార్థంతో తయారు చేయబడిందో దానిపై కూడా ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. సహజమైన పరుపును సరిగ్గా చూసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటుంది. మీ పరుపు ఎనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే అది కచ్చితంగా భర్తీ చేయాలి. ఎందుకంటే ఎనిమిదేళ్ల తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందులోని దుమ్ము, చెమట కణాలు ఆరోగ్యానికి ఇబ్బందిగా మారతాయి.

కుంచించుకుపోవడం అనేది పాత పరుపు అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. మీ పరుపు కుంగిపోవచ్చు, మృదువుగా లేదా మధ్యలో వంగి ఉండవచ్చు. అటువంటప్పుడు మీరు మంచం మీద పడుకుంటే మీ తుంటిలో విపరీతమైన నొప్పిని అనుభవిస్తారు. రాత్రంతా హాయిగా నిద్రపోవడం సాధ్యం కాదు. అందుకే మీ వెన్నెముక వంకరగా మారే అవకాశం ఉంది.

వీపు వేడిగా అనిపిస్తుందా..?

బెడ్ మీద పడుకునేటప్పుడు ఫ్యాన్, ఏసీ, కూలర్ లేదా తగినంత సహజమైన గాలి ఉండాలి. కొన్నిసార్లు వీపుతో సహా మొత్తం శరీరం వేడిగా అనిపిస్తుంది. ఇది పరువు చేయడానికి ఉపయోగించే విస్కోలాస్టిక్ పాలియురేతేన్ రసాయనాల వల్ల కూడా వస్తుంది. ఇవి వేడిని నిలుపుకొంటాయి.
మంచం నుండి చాలా సార్లు చెడు వాసన వస్తుంది. అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒకే బెడ్‌ను వాడుతుంటాం. ఇలా చేయడం తప్పు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మీకు అనారోగ్యం కలిగించవచ్చు. వెంటనే మీ బెడ్ మార్చడం మంచిది.

మీకు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉండి, సరైన నిద్రలేకపోతే.. కచ్చితంగా మీ పరుపుపై దృష్టిపెట్టండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version