ప్రతి రోజు మనం స్నానం చేసేటప్పుడు సబ్బుని ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది సబ్బుని ముఖానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు నిజానికి సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వలన శరీరం క్లీన్ గా ఉంటుంది. దుర్వాసన రాదు. కానీ బాగా ఎక్కువ సబ్బుని శరీరానికి ఉపయోగించడం వలన కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సబ్బును ఉపయోగించడం వలన డెడ్ సెల్స్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చర్మం నుండి దూరం అవుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అందంగా మారుతుంది. స్కిన్ షైనీగా కూడా ఉంటుంది.
సబ్బును మనం అన్ని సీజన్స్ లో కూడా ఉపయోగించొచ్చు సబ్బు ఉపయోగించడం వలన మేలు కలుగుతుంది అయితే కొన్ని నష్టాలు కూడా తప్పవు. డెర్మటాలజిస్ట్ సబ్బును ఉపయోగించడం వలన కలిగే లాభ నష్టాలని వివరించారు. సబ్బుని బాగా ఎక్కువ ఉపయోగించడం వలన చర్మం పొడి బారిపోతుంది. సబ్బుని ఆల్కలైన్ అనేది దానితో తయారుచేస్తారు దీంతో ఈ సమస్య తప్పదు. సబ్బుని ఎక్కువ ఉపయోగించడం వలన చర్మం పొడి బారిపోతుంది.
డ్రై స్కిన్ వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎక్కువ సబ్బు ఉపయోగించడం వలన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి కాబట్టి ఎక్కువగా సబ్బును ఉపయోగించకండి. సబ్బు ని రెగ్యులర్ గా ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లయితే ముఖం పొడిబారి పోయే ప్రమాదం ఉంది అలానే ముఖంపై మాయిశ్చర్ తొలగిపోతుంది. సబ్బుని రెగ్యులర్ గా ఉపయోగిస్తే ముఖంపై దురదలు కలుగుతాయి. స్కిన్ ఇరిటేట్ అవుతుంది. అయితే ముఖాన్ని సబ్బుతో రుద్దుకుంటే గ్లిజరిన్ సబ్బు ని ఉపయోగించడం మంచిది దీని వలన హాని కలగదు. లేదంటే మీరు ఫేస్ వాష్ ఇతర ప్రొడక్ట్స్ ని ఉపయోగించవచ్చు.