గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పిల్లలు ఉంటే.. ఇన్ని లాభాలు పొందొచ్చని మీకు తెలుసా..?

-

ఈరోజుల్లో ఎక్కడో కానీ అందరూ కలిసి ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ గా ఉంటున్నారు. అందులోనూ నగరాల్లో చాలా మంది పని చేయడం వలన ఊర్లను వదిలి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులకి దగ్గరగా మీరు మీ పిల్లల్ని పెంచినట్లయితే ఎన్నో లాభాలు ఉంటాయి. పిల్లలకి ఎప్పుడూ కూడా తాతయ్య, నానమ్మ లేదా అమ్మమ్మ వాళ్లకి దగ్గరగా ఉంచితే అనేక లాభాలని పొందవచ్చు. పిల్లలు ఎదిగే కొద్ది ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర పిల్లల్ని పెంచుతారు.

ఇలా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచడం వలన కొన్ని లాభాలని పొందవచ్చు. పెద్దవాళ్లు రకరకాల కథలు చెబుతూ ఉంటారు. దీని వలన పిల్లలకి ఆనందం కలుగుతుంది. స్క్రీన్స్ కి దూరంగా ఉంటారు. అలాగే పెద్దవాళ్లు జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాల గురించి పిల్లలతో చెప్తూ ఉంటారు. దీంతో లైఫ్ అంటే ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. అవగాహన వస్తుంది. ఏ పిల్లలైతే వారి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతారో వాళ్ళల్లో కలుపుగోలుతనం ఎక్కువగా ఉంటుంది. మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. స్నేహభావాన్ని పెంచుతారు.

ఇలా పెద్ద వాళ్ల దగ్గర పెరిగిన వాళ్ళలో క్రమశిక్షణతో పాటుగా సమయపాలన కూడా వస్తుంది. పెద్దవాళ్ల దగ్గర పిల్లలు పెరిగినట్లయితే వారికి మంచి అలవాట్లు వస్తాయి. చిన్న చిన్న పనులు చేయడం వంటివి కూడా స్వతహాగా వాళ్ళకి అలవాటవుతాయి. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ కి ప్రయారిటీ ఇచ్చి మాతృభాషని మర్చిపోతున్నారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎవరైతే పెరుగుతారో వాళ్లకు మాతృభాష బాగా వస్తుంది. ప్రేమానురాగాలు కూడా లభిస్తాయి. అలాగే ఎవరైతే పెద్ద వాళ్ళ దగ్గర పెరుగుతారో వాళ్ళు వ్యాయామం చేయడం, వాకింగ్ వంటివి అలవాటు అవుతాయి. ఇలా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన వాళ్ళలో ఎన్ని మార్పులు ఉంటాయి ఇన్ని లాభాలు వారు పొందుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version