విద్యార్థి శైలజ మృతి పై కేటీఆర్ సంచలన ట్వీట్

-

విద్యార్థి శైలజ మృతి పై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన స్కూల్ విద్యార్దిని ఫుడ్ పాయిజన్ కావడంత శైలజ మృతి చెందారు. ఐహే ఈ విషాదం పై కేటీఆర్ స్పందించారు.

పెద్ద చదువులు చదివేందుకు గురుకులాలో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలి తీసుకుంటివి అంటూ ఆగ్రహించారు కేటీఆర్. 20 రోజులుగా నిమ్స్ లో ఉంటే కనీసం ఒక్కరోజైనా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించకపోతివి! అని పేర్కొన్నారు.

 

గురుకులాల్లో భద్రంగా ఉండాల్సిన అమాయక విద్యార్థులు నీ పనితీరు వలన నెలకు ముగ్గురు చొప్పున నేలరాలిపోతున్నరు అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా నీకు పేదల పిల్లల బాధలు పట్టవాయే విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పవాయే అని మండిపడ్డారు. ఎంతమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణం అవుతావు ? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండెకరుగుతుంది రేవంత్?! అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version