అబ్బాయిల పాదాలనుచూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయెచ్చట..!

-

చేతిరేఖలను బట్టి జాతకం చెప్పేస్తారు..మనం కూడా వాటిని నమ్ముతాం. అలాగే కాళ్ల వేళ్లను బట్టి ఎటువంటి భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. అయితే..ఇవి 100శాతం నిజమని ఏం ఉండదు. కొన్నిసార్లు బోల్తా కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఓ డేటింగ్ సైట్ ఒక సర్వే నిర్వహించింది. అదేంటంటే.. ఈ టైప్ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని ఆ సర్వేలో తేలింది.

‘మిర్రర్‌’ ఆన్‌లైన్‌ సైట్‌ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్‌ ఎన్‌కౌంటర్స్‌’అనే డేటింగ్‌ సైట్‌ పురుషులపై ఒక సర్వే నిర్వహించింది. మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని ఆ సర్వేలో వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో తెలిపింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తేలింది.

ఎన్ని అంగుళాల పాదాలు ఉంటే..ఎంత శాతం మోసం చేస్తారు..

11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం
10 అంగుళాల వారు 25 శాతం,
12 అంగుళాలుంటే 22 శాతం,
13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం

ఇలా ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో వారు అంగీకరించడం విశేషం.

ఇల్లిసిట్‌ ఎన్‌కౌంటర్స్‌’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. అంతేకదా..పాదాలను బట్టి మోసం చేసేది ఏంటి..మీరు కూడా నమ్మరులేండి.. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

అయినా రెండు వేల మంది పురుషులును బట్టి మొత్తం పురుషజాతినే ఇలా అని చెప్పటం కరెక్టుకాదు. పెద్ద పాదం ఉన్న వాళ్లు కూడా తమ భాగస్వామిని మోసం చేయకుండా చూసుకుంటున్న వాళ్లు ఉంటారుకదా..కేవలం వాళ్లు చేసిన సర్వే వివరాలను మాత్రమే మీకు ఆసక్తికరంగా ఉంటుంది అందించాం.. ఇంతకీ మీ పాదల సైజు ఏంతో!

Read more RELATED
Recommended to you

Exit mobile version