ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరెంట్ షాక్ కొడుతూ ఉంటుంది విద్యుత్ షాక్ కి గురైన వ్యక్తిని కాపాడడానికి ఈ చిట్కాలను పాటిస్తే ఆ వ్యక్తిని మనం సురక్షితంగా కాపాడొచ్చు. విద్యుత్ షాక్ కి గురైన వ్యక్తిని కాపాడడానికి ముందుగా కరెంటు సరఫరా ఎక్కడి నుండి అయితే వస్తుందో దానిని నిలిపివేయాలి. ఆ వైర్ నుండి ఆ వ్యక్తిని వెంటనే వేరు చేయాలి. షాక్ కొట్టగానే ఆ వ్యక్తిని వెళ్లి మనం కూడా పట్టుకోకూడదు.
అలా చేయకుండా ఏదైనా కర్రతో కానీ దేనితో అయినా కానీ కొట్టి బయటకు తీసుకురావాలి. షాక్ కి గురైన వ్యక్తి స్పృహని కోల్పోకుండా గాలి తగిలిలా చూసుకోవాలి ఆందోళన నుండి బయటపడేసి వారికి కొంచెం ధైర్యం చెప్పాలి ఒకవేళ కనుక ఆ వ్యక్తి స్పృహ తప్పినట్లైతే పల్స్ ని చూడాలి పల్స్ అందకపోతే సీపీఆర్ చేయాలి. ఒకవేళ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే నోటి ద్వారా శ్వాసని అందించాలి.
ఒకవేళ ఏమైనా కాలిన గాయాలైనట్లయితే నీళ్లు పోయడం కానీ క్రీములు వంటివి రాయడం కానీ చేయడం మంచిది కాదు డైరెక్ట్ గా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఒక్కొక్కసారి కొంతమంది పోల్ నుండి కానీ లేదంటే ఇంటి మీద నుండి కానీ కింద పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు వెంటనే అంబులెన్స్ ని పిలిచి తీసుకువెళ్లాలి. ఎవరైనా వ్యక్తికి షాక్ తగిలినట్లయితే హార్ట్ బీట్ చూడాలి ఆసుపత్రికి వెళ్లిన తర్వాత మోనిటర్ పెడితే తెలుస్తుంది. గుండె కిడ్నీలపై ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి టెస్టులు చేయించాలి. ఇలా ఎవరికైనా షాక్ కొట్టినట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు సురక్షితంగా బయటపడతాడు.