చీమలకు రక్తం ఉంటుందా..ఉంటే ఏ రంగులో ఉంటదో తెలుసా..!

-

చీమలు లేని ఇల్లంటూ ఉండదూ. ఎంత క్లీన్ గా ఉంచుకున్నా సరే..ఎప్పుడోఓసారి అయితే చీమలు కచ్చితంగా వంటగదిలోకి వచ్చేస్తాయి. కొన్నిసార్లు బెడ్ మీద ఏదైనా తీపివస్తువులు తిన్నా తెలియకుండానే బెడ్ కి చీమలు వచ్చేస్తాయి. కబోర్డ్స్ లో కూడా. ఇలా చెప్పుకుంటూపోతే..ఇంట్లో ఏదో ఓ మూల అయితే చీమలు రాజ్యం ఏలుతున్నాయి. ఇంకా అవి కుట్టాయంటే ఆ బాధ మామూలుగా ఉండదూ. సైజ్ చిన్నదైనా పెయిన్ పెద్దదే. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది..ఈ చిమ్మల్ని దొరికితేనా చంపేశాయలి, అసలు ఎందుకు ఉంటాయి ఇవి అనీ..దోమలైతే మనుషుల్ని కుట్టి రక్తం పీలుస్తాయి..అసలు ఈ చీమలు ఏం చేస్తాయ్ మరీ, మనల్ని కుట్టి రక్తం తాగుతాయా..అది ఉందే ఇంత చిన్నసైజ్..అసలు చీమలకు రక్తం ఉంటుందా..ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా. ఉదాహరణకు మనం దోమల్ని నలిపామే అనుకో రక్తం వస్తుంది. మరి చీమలను ఎప్పుడైనా నలిపారా? మనం ఈరోజు మనకున్న ఈ ధర్మసందేహాలను నివృత్తి చేసుకుందాం:)

చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుందట. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్‌ వెన్నెముక ఉండే జంతువులు – సకశేరుకాలులో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్‌ అధికంగా ఉండటమే అందుకు కారణమట.

వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనకైతే..రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుందని చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందా… అయితే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్ ఉంటుంది.

రక్తం – హిమోలింఫ్ మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్‌ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్‌ చేరవేస్తుంటాయి.

ఇంత చిన్న చీమల్లో ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందనమాట..ఈ సారి చీమలు వచ్చినప్పుడు తీక్షణంగా గమనిచండి..మరీ ఎక్కువగా చూసేకు..కుట్టేస్తాయ్:)

-triveni

Read more RELATED
Recommended to you

Exit mobile version