రైతుల పోరాటంతోనే సాగు చట్టాలు వెనక్కి – రేవంత్ రెడ్డి.

-

రైతుల పోరాటంతోనే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని.. రైతులు విజయం సాధించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కామారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం యూపీ , పంజాబ్ ఎన్నికల కోసమే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నరేంద్ర మోదీ మెడలు వంచేలా రైతులు పోరాటం చేశారని అన్నారు. ప్రాణాలు పోయిన ప్రతీ రైతు కుటుంబానికి మోదీ క్షమాపణలు చెప్పాలని… రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతులపై కక్ష సాధింపుల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని విమర్శంచారు. వరి ధాన్యం కొనుగోలులో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. బండి సంజయ్ ఎవరికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం షాపుల టెండర్ల ద్వారా వచ్చిన రూ. 12 వేల కోట్ల ఆదాయంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version