పాములు పగబడతాయా..? ఇందులో నిజమెంత ఉంది..?

-

పాములను పూజించే మనమే.. అవి కనపడితే దాడి చేసి చంపేస్తాం.. లేదంటే అవి మనల్ని ఎక్కడ కాటేస్తాయో అన్న భయం. మీరు చాలా సార్లు వినే ఉంటారు.. పాములు పగబట్టాయంటే.. చంపేదాక వదలవు, అలాగే చాలా మందిని పగబట్టిచంపేశాయి అని. పాములు పగబడితే.. కలలో కూడా అవే వస్తాయని కొందరు చెప్తుంటారు. అసలు పాములు నిజంగా పగబడతాయా.? వాటికి ఆ తెలివి ఉందా..? మనుషుల్లా కోపం, ద్వేషం, పగ ఇవి పాములకు ఉంటాయా..? పాముల గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ కొన్ని ఈరోజు తెలుసుకుందాం. అపోహలు వెనకున్న వాస్తవాలు ఇవే..!

నాగ పంచమి, నాగుల చవితి వంటి ప్రత్యేక రోజులలో పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటుంటారు. ఆ రోజులలో పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టల దగ్గరకు వచ్చి.. పూజలు చేస్తారు. పాములు అసలు పాలు తాగుతాయా…? పాములు పాలకు సంబంధించిన ఉత్పత్తులను జీర్ణించుకోలేవు. పాములకు బాగా దాహం వేసిన సమయంలో ఏమీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాలు తాగుతాయి.

వివిధ రకాల పాములు తమ ఆహారాన్ని తినడంలో మూడు పద్ధతులు ఉంటాయి. విషపూరిత పాములు తమ విషాన్ని కాటు వేయడం ద్వారా దానిలోకి ఇంజెక్ట్ చేస్తాయి, కొన్ని పాములు వాటి ఆహారాన్ని చుట్టి ఊపిరాడకుండా చేస్తాయి. చిన్న పాములు తింటాయి.

కొంతమంది పాముల తలపై వజ్రాలు ఉంటాయి అంటుంటారు.. నిజానికి పాములు తమ తలలో వజ్రాన్ని కానీ, మరే వస్తువును కానీ మోయడం అసాధ్యం. ఇది కూడా పూర్తిగా పుకారు మాత్రమే.

ఇక పాముల గురించి మోస్ట్‌ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్‌.. పాములు పగబడతాయి అని. సినిమాల్లో, సీరియల్స్‌లో మనకు ఇవి బాగా చూపించి. మనం కూడా నిజమే అని నమ్ముతున్నాం. వాస్తవానికి పాములకు మనుషులను గుర్తుంచుకోవడానికి, లేదా గుర్తు పట్టడానికి అవసరమైన జ్ఞాపకశక్తి లేదు. పాములు ప్రతీకారం తీర్చుకునే ప్రాణులు కావు. పాములు పగబడతాయి అనే అపోహను బలంగా నమ్మడం వల్ల చాలామంది పాములంటే భయపడతారు.

ఇక నాగస్వరానికి పాములు డ్యాన్స్‌ వేస్తాయి. అవును మీరు కూడా రోడ్లుపై ఎప్పుడైనా ఇలాంటి ప్రదర్శనలు చూసే ఉంటారు. ఒక అతను నాగస్వరంతో అటు ఇటు ఊగుతూ అది ఊదుతాడు. పాము కూడా అలానే ఊగుతుంది. నాగస్వరానికి పాము డ్యాన్స్‌ చేయదు. పాములకు అసలు చెవులు ఉండవు. అలా ఉదుతున్నవాళ్ళు పాము కళ్ళముందు నాగస్వరాన్ని వేగంగా కదలడం వల్ల, వాళ్ళు నేలపై తట్టడం వల్ల వాటిని అవి రక్షించుకునే క్రమంలో కదులుతూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version