తలస్నానం చేసిన ప్రతిసారీ.. కండీషనర్‌ పెట్టేస్తున్నారా..?

-

జుట్టును జాగ్రత్తగా ఉంచాలని అందరూ అనుకుంటారు..కానీ కొందరై సరైన పద్ధతులు పాటిస్తారు.. తెలిసి తెలియక చేసే తప్పులే ఎక్కువగా ఉంటాయి.. కొన్ని సమస్యలను పరిష్కరిస్తే..మరికొన్ని కొత్తవాటిని తెచ్చిపెడతాయి.. తలస్నానం చేసిన తర్వాత కండీషనర్‌ అప్లై చేయడం చాలామందికి ఉన్న అలవాటే.. కండీషనర్‌ పెట్టగానే జుట్టు సాఫ్ట్‌గా అవుతుంది. చూడ్డానికి బాగా కనిపిస్తుంది..కండిషనర్ అనేది మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎమోలియెంట్స్, సిలికాన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి జుట్టు తేమని తిరిగి నింపుతాయి. జుట్టు చివర్ల సున్నితంగా చేస్తాయి. అయితే తలస్నానం చేసిన ప్రతీసారి కండిషనర్ పెట్టాల్సిందేనా అనే డౌట్‌ మీకు రావొచ్చు..పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇది జుట్టుకి అనేక ప్రయోజనాల్ని అందిస్తుందట…

కండీషనర్‌ వల్ల ఉపయోగాలు..

మెరిసేలా చేస్తుంది.

జుట్టుకి తప్పనిసరిగా కండిషనర్ పెట్టడం అవసరం. ఇది జుట్టుకి రక్షణగా పని చేస్తుంది. జుట్టు తంతువులని కాపాడుతుంది. కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు సహజమైన రంగు పోకుండా నివారిస్తుంది. అందుకే జుట్టుని షాంపూ చేసిన తర్వాత ప్రతిసారీ కండిషనర్ ఉపయోగించడం మర్చిపోవద్దు. అలా చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.

స్ప్లిట్స్ తగ్గిస్తుంది..

జుట్టు పెళుసుగా, పొడిగా మారినప్పుడు స్ప్లిట్స్ ఏర్పడతాయి. దాని వల్ల జుట్టు చివర్ల చీలిపోయి నిర్జీవంగా తయారవుతుంది.. అవి జుట్టు పెరుగుదలని నిరోధిస్తాయి. కండిషనర్ ఉపయోగించడం వల్ల జుట్టు స్ప్లిట్స్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. జుట్టుకు మృదుత్వంతో పాటు పోషణ అందిస్తుంది. సహజమైన మెరుపుని ఇస్తుంది. కండిషనర్ వల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు చిట్లకుండ కాపాడుతుంది.

పొడిగా ఉండదు..

రెగ్యులర్‌గా షాంపూ చేయడం వల్ల స్కాల్ఫ్‌లోని సహజ నూనె తొలగిపోతుంది. తేమని నిలుపుకోవడం కష్టం.. పొడిగా అయిపోతుంది. ఈ పొడిదనం నుంచి బయట పడేందుకు కండిషనర్ ఉపయోగపడుతుంది. జుట్టు లోపలి వరకు వెళ్లి తేమని అందిస్తుంది.

జుట్టు చిక్కు పడకుండా..

తలస్నానం చేసినప్పుడు జుట్టు చిక్కుబడుతుంది. సరిగ్గా దువ్వుకోకపోతే.. ఉన్నది కూడా ఊడిపోతుంది.. దాన్ని విడదీసేందుకు కండిషనర్ సహాయపడుతుంది. కండిషనర్ స్కాల్ఫ్‌ని హైడ్రేట్ చేస్తుంది. దువ్వెన పెట్టినప్పుడు జుట్టు చిక్కు లేకుండా సులభంగా దువ్వుకోవచ్చు. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ధృడంగా ఉండేలా చేస్తుంది.

ఎంపిక ముఖ్యం..

కండీషనర్‌ పెట్టడం మంచిదే..కానీ ఎటువంటిది పెడుతున్నామనేది ముఖ్యం.. కెమికల్స్ ఎక్కువగా ఉండకుండా సహజమైన పదార్థాలతో తయారు చేసే కండిషర్స్ ఎంచుకోవడం తప్పనిసరి. నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న కండిషనర్స్ పెట్టడం వల్ల జుట్టుకి కావలసిన పోషణ అందుతుంది. ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. నాణ్యత లేని కండిషనర్స్ ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కండిషనర్స్ కొనుగోలు చేసే ముందు ఏయే పదార్థాలతో వాటిని తయారుచేశారనేది చెక్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version