పూర్వకాలం నుండి పాటిస్తున్న పద్ధతులని మనం తరచూ పాటిస్తూ ఉంటాము. దాని వెనక ఉన్న కారణం తెలియనప్పటికీ కూడా అదే ఉత్తమమైన మార్గం అని మనం అనుసరించడం జరుగుతుంది. అయితే తరతరాల నుంచి కూడా చిన్న పిల్లలకు దిష్టి తీయడం మనం చూస్తూ ఉంటాం. దిష్టి తీయడానికి వివిధ పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటాం. అయితే ఎందుకు చిన్నారులకి దిష్టి తీస్తూ ఉంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
అయితే ఇలా దిష్టి తీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోతుంది. చుట్టూ ఎక్కువ మంది చేరడం వల్ల చిన్న పిల్లలు అస్వస్థతకు గురవుతారు ఆ కొంత స్వస్థతను దిష్టితో దూరం చెయ్యచ్చు. అదే విధంగా ఎర్ర నీళ్ల తో కొందరు దిష్టి తీస్తూ ఉంటారు ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల రోగాలు రాకుండా ఉంటాయట. అలానే దిష్టి తీయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ధైర్యం వస్తుంది.