ప్రతి ఒక్కరికి కూడా ధనవంతులు అవ్వాలని ఉంటుంది. ధనవంతులు అవ్వాలంటే కొన్ని తప్పులు చేయకూడదు ధనవంతులు అవ్వాలంటే వీటిని ఫాలో అయిపోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే డబ్బుని ఆదా చేసుకోవడానికి అవుతుంది. ఎక్కువగా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం వచ్చిన సంపాదనలో 50% ఇంటి ఖర్చులు కోసం పెట్టండి. 30% ఎంటర్టైన్మెంట్ కోసం 20 శాతం సేవింగ్స్ కోసం ఖర్చు చేయడం వలన ధనవంతులు అవ్వచ్చు. ధనవంతులు అవ్వాలంటే ఖచ్చితంగా ఫిక్స్ డిపాజిట్లు వంటివి చేసుకోవడం ఉత్తమం. ఈరోజుల్లో చాలా ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి.
రిస్క్ లేకుండా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆదా చేసుకోవడం ఖర్చు చేయడం కంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. మీరు సంపాదించే దానికంటే 6 రెట్లు ఎక్కువ ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచుకోండి. భవిష్యత్తులో ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అనేది తెలీదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వలన భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు నుంచి బయటపడడానికి అవుతుంది.
సంపాదించడానికి అవకాశాలు చూసుకోవాలి. ఎక్కువ సంపాదించడానికి ఉన్న అవకాశాలు అన్నిటిని కూడా మీరు గమనించాలి. పార్ట్ టైం జాబ్స్ చేస్తే కూడా ఎక్కువ సంపాదించొచ్చు. సమయం ఉంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడానికి చూసుకోండి. అనవసరమైన ఖర్చులు చేయడం వలన డబ్బులు వృధా అయిపోతాయి. అనవసరమైన ఖర్చులు చేయొద్దు ధనవంతులు అవ్వాలంటే అవసరాన్ని బట్టి ఖర్చు చేయండి. తక్కువ వయసు నుంచి కూడా సేవింగ్స్ చేస్తే ఎక్కువ ఆదా చేయడానికి అవుతుంది ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ధనవంతులు అయిపోవచ్చు.