తల్లిదండ్రుల ప్రేమకు కూడా హద్దు ఉంటుంది.. ఈ పొరపాట్లు చేస్తే మీ పిల్లలు ఓడిపోతారు!

-

చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రేమ ఎంతో ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే హద్దులు దాటి ప్రేమను చూపిస్తారో అప్పుడు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మితిమీరిన ప్రేమ మరియు రక్షణ వలన పిల్లల భవిష్యత్తు పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత చదువుకున్నా సరే పిల్లలు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు. జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా సరే వాటిని ఆచరించడం కూడా ఎంతో అవసరం. జీవితంలో ఎదురయ్యే సమస్యలు మాత్రమే కాకుండా సంబంధాల విషయంలో ఎంతో ఇబ్బందిపడుతున్నారు. దానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రుల పెంపకం.

ఎందుకంటే హద్దుకు మించి ప్రేమ మరియు రక్షణను చూపించడం వలన సొంతంగా దేన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు మితిమీరిన రక్షణను చూపిస్తారో వారి భవిష్యత్తు పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని ముందుగానే ఆలోచించి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను పిల్లలు అడగకుండానే అందజేస్తున్నారు. ఈ విధంగా జరగడం వలన పిల్లలు సొంత నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు మరియు చిన్న పనులను కూడా సొంతంగా పూర్తి చేయలేకపోతున్నారు.

పైగా మితిమీరిన రక్షణను చూపించడం వలన పిల్లల్లో ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం అస్సలు ఉండదు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. దేన్నైనా ఎదుర్కోవాలంటే నైపుణ్యం ఎంతో అవసరం. అయితే ఎప్పుడైతే మితిమీరిన రక్షణ ఉంటుందో పిల్లలో నైపుణ్యం కూడా తగ్గిపోతుంది. తల్లితండ్రులు రక్షణను ఎక్కువగా చూపించడం వలన పిల్లలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వయసు పెరిగినా సరే నిర్ణయాలు తీసుకోలేరు మరియు ఎంతో భయస్తులుగా బతుకుతారు. తల్లిదండ్రులు పిల్లలలో ఉండే ప్రత్యేకతను గమనించాలి మరియు ఆ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేయాలి. ఇలా చేయడం వలన పిల్లలు భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version