మడత పెట్టే మెట్లను ఎప్పుడైనా చూశారా?

-

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకుంటున్నారు. మరి ముఖ్యంగా అంటే టెక్నాలజీకి అనుగుణంగా ఇళ్ళు, బిల్డింగ్ నిర్మాణాలు నిర్మిస్తున్నారు.అటువంటి వాటిని చూస్తే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఉండడంతో కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు..

ఈ మధ్య కాలంలో అందరు ఇల్లను వారి అభిరుచికి తగ్గట్లు నిర్మిస్తున్నారు..టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని సరికొత్త టెక్నాలజీలతో ఉపయోగించుకుని నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటిదే. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఓ ఇంటికి మడత పెట్టె మెట్లనును పెట్టారు. అవసరానికి మెట్లను ఉపయోగించుకొని తర్వాత ముడిచి పెట్టడం చేస్తున్నారు.

పల్లెటూర్లలో అయితే ఇల్లు కొంచెం విశాలంగానే ఉంటాయి. కానీ పెద్ద పెద్ద సిటీలలో మాత్రం కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కూడా ఐదు ఆరు అంతస్తులు కట్టేస్తూ ఉంటారు. ఆ ఇల్లు ఎలా ఉంటాయి అంటే చూడటానికి అగ్గిపెట్టె లాగా కూడా ఉంటాయి. అయితే అటువంటి వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే మెట్లు బాగా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. మనకు అవసరం లేనప్పుడు వీటిని గోడకు అతుక్కుపోయేలా మడతపెట్టొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుందట..ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ మెట్లను ఓసారి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version