1980 నుంచి కేవలం ఉత్తరాల ద్వారానే మాట్లాడుకున్న స్నేహితులు మొదటిసారి కలిస్తే..!!

-

ఈరోజుల్లో ప్రేమ లేఖలు రాసే వాళ్లు లేరు. ఇక యోగక్షేమాలు అడుగుతూ ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు. అంతా వాట్సప్‌, లేదా డైరెక్ట్‌గా ఫోన్‌ కాల్స్‌. కానీ ఫోన్‌లో టైప్‌ చేసిన మెసేజ్‌ కంటే.. ఉత్తరాల్లో రాసిన అక్షరాలకే ఎమోషన్‌ బాగుంటుంది.మీకు ఇష్టమైన వాళ్ల దగ్గర నుంచి మీకు ఒక ఉత్తరం వస్తే అది చుదువుతున్నప్పుడు ఆ ఫీలే వేరు. అక్షరాల్లోనే భావాలను పంచుకున్నా దృఢంగా ఉండే ఏకైక బంధం స్నేహం. అందుకు నిదర్శనం ఈ ఇద్దరు స్నేహితులే. 1980 నుంచి ఇప్పటి వరకూ కేవలం ఉత్తరాల ద్వారానే వాళ్లు మాట్లాడుకున్నారు. డైరెక్టుగా కలిసింది లేదు. అయిన వారికి ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమ. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా..! అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే..

క్రిస్టల్ ఆల్స్టన్ అనే స్నేహితురాలు. కాలిఫోర్నియాలోని అంటారియో నివాసి. మరొకరి పేరు హేలీ బ్రిగ్స్. అతను పెన్సిల్వేనియాలోని డగ్లస్‌విల్లే నివాసి. ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం పాఠశాల ప్రాజెక్టులో ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు. మొదటిసారే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 10 ఏళ్ల పిల్లలను పాఠశాల ప్రాజెక్ట్ తరగతిలో లేఖ రాయమని అడిగారు. తర్వాత ఇద్దరూ ఒకరికొకరు లేఖలు రాసుకున్నారు. అక్కడి నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు మొదలయ్యాయి.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరూ లేఖల్లో మాట్లాడుకున్నారు. లేఖలో మనకు తెలిసిన వాటికి రెండూ పూర్తిగా భిన్నమైనవి. మన జీవన శైలిలో మార్పు వస్తోంది. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేం కలిసి కూర్చున్నాం తప్ప ఈ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే మా ఇద్దరి గురించి మాకు తెలుసు అంటున్నారు స్నేహితులు.

ఇద్దరూ 2020లో తమ యాభైవ పుట్టినరోజు సందర్భంగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిశారు. ఆల్స్టన్ మొదటిసారిగా పెన్సిల్వేనియాను సందర్శిస్తున్నారు. అక్కడ తన స్నేహితుడిని కలిశాడు. ఇద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఇటాలియన్ డిన్నర్ చేశారు. మేము టచ్‌లో కొనసాగుతామని ఆల్స్టన్ చెప్పారు. ఇన్నాళ్లు ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటున్న స్నేహితులు ఇక నుంచి సోషల్ మీడియానే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా సులభమైన మార్గం. అలాగే, ఒకరి ముఖం మరియు ఫోటోను ఇతరులు చూడగలరు కాబట్టి వారు సోషల్ మీడియాను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట. క్రేజీగా ఉంది కదూ..! దాదాపు 43 ఏళ్ల పాటు కేవలం ఉత్తరాల ద్వారానే వాళ్లు మాట్లాడుకున్నారంటే.. మీరు కూడా ఒకసారి మీకు ఇష్టమైన వారికి చెప్పకుండా ఉత్తరం రాసి పంపండి. వాళ్లు మస్త్‌ కుష్‌ అవుతారు.! వాట్సప్‌ చాటింగ్‌ది ఏం ఉంది.. స్టోరేజ్‌ ఎక్కవైందని డిలీట్‌ చేస్తారు. ఉత్తరాల్లో రాసే ప్రతి పదం ఎప్పటికీ మధురజ్ఞాపకంగా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు అయినా సరే..! అదే ఎమోషన్‌ను క్యారీ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version