దుబాయ్‌లోని స్టార్‌ హోటల్‌కి గిన్నీస్‌ వరల్డ్ రికార్డు.. ఎందుకు వచ్చిందో తెలిస్తే షాకే

-

ఏదైనా సాధించటం అంటే అంత ఈజీ కాదు..గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించటం అంటే చాలా పెద్ద విషయమే..భిన్నంగా ఏదైనా చేస్తే ఇలాంటి వాటిల్లో చోటు దక్కుతుంది. దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ న్యూయర్ వేడుకలతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. ఏం చేస్తే రికార్డు సృష్టించిందా అనుకుంటున్నారు. గాజు గ్లాసులను పిరమిడ్ లా పేర్చి ఈ ఘనత సాధించిందట.

గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ సాధించడం చాలా గొప్ప విషయం. కానీ దుబాయ్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ న్యూఇయర్‌ వేడుకలతో పాటు గిన్నీస్‌ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 54వేల 740 గాజు గ్లాసుల్ని 8.23 మీటర్ల ఎత్తులో అమర్చి తమకు సాటిమరెవరూ లేరని రుజువు చేసింది. నాలుగేళ్ల క్రితం నెలకోల్పబడిన రికార్డును తుడిచి వేసింది.

దుబాయ్‌ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ పేరు ఇప్పుడు గిన్నీస్ వరల్డ్‌ రికార్డు చోటు సాధించింది. కస్టమర్లు ఎక్కువ వచ్చినందుకో, వెరైటీ వంటకాలు చేసినందుకో కాదు. మందు పార్టీకి అరేంజ్ చేసే గాజు గ్లాసుల్ని వేల సంఖ్యలో ఓ గోపురంగా పేర్చి ఈ రికార్డును నెలకోల్పారు. అయితే ఇది హోటల్‌ గొప్పతనం అనడం కంటే న్యూఇయర్‌ సందర్భంగా వేడుకల నిర్వాహకుల క్రెడిట్‌గానే చెప్పుకోవాలి. ఒకటి రెండు కాదు 54వేల 740 గ్లాసుల్ని 8.23 మీటర్ల ఎత్తు వరకూ ఓ పిరమిడ్‌లా అమర్చారు.

అసలు గాజు గ్లాస్ లను పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ అద్భుతమే గిన్నీస్‌ వరల్డ్ రికార్డు సాధించేలా చేసింది. స్టార్‌ హోటల్‌లో అట్లాంటిస్, ది పామ్‌ అనే ఈవెంట్ ఆర్గనైజేషన్‌ తలపెట్టిన గ్లాస్‌ పిరమిడ్ నిర్మాణంలో మోయట్, చాండన్ అనే సోదరులు దీన్ని రూపొందించారు. ఈనెల 30 తేదిన న్యూఇయర్‌కి స్వాగతం పలుకుతూ హోటల్‌కి చెందిన రిసార్ట్‌లోని అసటీర్‌ టెంట్‌లో ఈ విధంగా గాజు గ్లాసుల్ని అందంగా గోపురంగా ఒకదానిపై మరొకటి నిలబెట్టి అందర్ని దృష్టిపడేలా చేశారు. వచ్చినవారంతా..ఈ పిరమిడ్ ను ఆసక్తిగా చూశారు.

గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ

దుబాయ్‌లోని అట్లాంటిస్, ది పామ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కోసం 1548 సూట్‌ రూమ్స్‌ ఉంచారు. అక్కడికి వచ్చిన కస్టమర్లు ఈ పిరమిడ్ చూసి బిత్తరపోయారు. ఇంత ఎత్తులో గ్లాస్ పిరమిడ్ ఏర్పాటు చేయడం కొత్తేమి కాదు. 2017లో మాడ్రిడ్ లో కూడా ఇలాంటి రికార్డే సృష్టించారు. అయితే అప్పుడు 50వేల 116 గ్లాసులను మాత్రమే గోపురంగా నిర్మించారు. కానీ ఇప్పుడు దుబాయ్‌లోని స్టార్ హోటల్ ఆ రికార్డ్ ను‌ బ్రేక్ చేసింది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version