అమ్మ ఎరికైనా అమ్మ అవుతుంది కానీ.. భార్య ఎవరికైనా భార్యకాదు..అసలు మరొకరి భార్యను వేరే దృష్టితో చూడటమే తప్పు. మన దేశంలో ఇలా చేస్తే తీసుకెళ్లి జైల్లో కూడా వేస్తారు. ..వేరే వాళ్లను అద్దెకు తెచ్చుకునే సంప్రదాయం ఒకటి ఉంది అంటే..ఇదంతా ఇండియాలో నడవదులే..భార్య అంటే భారతదేశంలో దేవతలా పూజిస్తారు, ఈ ఆచారాలు ఇక్కడ కాదు అనుకుంటున్నారేమో..లేదు మనదేశంలోనే ఈ ఆచారం ఉంది. ఎక్కడో కాదు మధ్యప్రదేశ్ లోనే.. పోనీ ఎప్పుడో పూర్వకాలం సాగింది ఏమో దాని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో..ఆ ఆచారం..ఇప్పటికీ ఏంటి ఈరోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. ఏదో భూమి కొన్నట్లు స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని మరీ భార్యను అద్దెకు ఇస్తారట. అసలు ఈ వింత ఆచారం ఏంటో ఈ కథంటో చూద్దాం.
ఇలా వెళ్లిన మహిళ.. వేరే వారికి భార్యగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా వారితో భార్యలాగానే ప్రవర్తించాల్సి ఉంటుంది.. వారి కుటుంబ బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవాలి. వయసు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ఇస్తారట.
ఇలా వెళ్లిన క్రమంలో కొన్నిసార్లు మహిళలు, బాలికలు చిత్రహింసలకు కూడా గురవుతుంటారు. అయితే తల్లిదండ్రులు కానీ, పంపించిన భర్త కానీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటం దారుణం.. దీంతో చాలామంది తమ బాధను లోలోపలే దిగమింగుకుంటూ చిత్రహింసలను అనుభవిస్తుంటారు. చాలా సందర్భాల్లో పోలీసులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించినా.. వారిలో మాత్రం మార్పు రావడం లేదట
దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుందట. ఇలాంటి ఆచారాన్ని మన దేశంలోనే కాకుండా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో కూడా పాటిస్తున్నారు. ఆడవారిని ఆటబొమ్మల్లా చూస్తున్న ఈ దిక్కుమాలిన ఆచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇది పోయేలా లేదు.
-triveni