కంగనా రనౌత్ పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలి- శివసేన

-

కంగనా రనౌత్ దేశ స్వాతంత్య్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 1947 లో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష అని ఇటీవల ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో పాటు అన్ని విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. తాజాగా శివసేన కూడా కంగనా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కంగనాకు కేంద్రం ఇచ్చిన పద్మ శ్రీ అవార్డ్ ను వెనక్కి తీసుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. ఇటీవల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా పద్మ శ్రీ అవార్డ్ ను అందుకుంది. 1947లో భారత స్వాతంత్య్రాన్ని ‘భీక్‌’ (భిక్ష) గా అభివర్ణించడం దేశద్రోహ కేసు అని, కేంద్రం ఆమెకు పద్మశ్రీ అవార్డును తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయం డిమాండ్ చేసింది.

నిజానికి దేశానికి స్వాతంత్య్రం 2014లో( మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత) వచ్చిందని కంగనా వ్యాఖ్యానించింది. ఎంతో మంది స్వతంత్య్ర యోధులు ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి దాన్ని కంగనా అవమానించిందని శివసేన మండి పడింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం, పోరాటంపై ఏమాత్రం గౌరవం ఉన్నా  కంగనా నుంచి పద్మ శ్రీ ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేసింది శివసేన

Read more RELATED
Recommended to you

Exit mobile version