కూలర్‌ నుంచి కంపుకొట్టే స్మెల్‌ వస్తుందా…? ఇలా చేయండి..!

-

సమ్మర్‌ వచ్చేసింది.. ఇంట్లో ఉన్నా కూడా చెమటలు.. అసలు నిప్పులు మీదపడుతున్నట్లే ఉంది. ఫ్యాన్‌ వేసుకుంటే..వేడిగాలి.. అందరి ఇళ్లలో ఏసీలు ఉండవు..కానీ కూలర్స్‌ అయితే దాదాపు అందరి ఇంట్లో ఉంటాయి.. కూలర్‌ వల్ల కూడా రూమ్‌ అంతా చల్లగా అవుతుంది. బాగుంటుంది కానీ.. కొన్నిసార్లు ఈ కూలర్ల నుంచి చేపల వాసన వస్తుంది. అదేంటో నీసు వాసన వస్తుంది. కంపు కొడుతుంది. దానివల్ల రూమ్‌ అంతా కూడా అదే వాసన వస్తుంది.. గతి అంతా చేపల మార్కెట్‌లా అయిపోతే ఇంకా చిరాకుగా అనిపిస్తుంది.. ఈ వాసన పోగొట్టడానికి ఎన్నిసార్లు నీరు మార్చినా, ఎన్ని లీటర్ల సెంట్ పోసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి అసలు పరిష్కార మార్గాలు మా దగ్గర ఉన్నాయి కదా..!

కూలర్ల నుంచి చేపల వాసన రావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా. చల్లని గాలికోసం కూలర్లలో నీరు పోస్తాం కాబట్టి, కూలర్ వాతావరణం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. కూలర్‌కు మూడు వైపులా ఉండే గడ్డి ప్యాడ్లలో దుమ్ము, ధూళి, ఇతర మలినాలు అన్నీ చేరి అవి మురికిగా మారతాయి. దీంతో ఆ ప్యాడ్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియానే చేపల వాసనను ఉత్పత్తి చేస్తుంది. కూలర్ల నుంచి ఇలా చేపల వాసన రాకుండా చల్లటి గాలిని మాత్రమే ఆస్వాదించాలనుకుంటే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

మీ ఎయిర్ కూలర్ చెడు వాసన వస్తుంటే, కూలింగ్ ప్యాడ్‌లు, ట్యాంక్, ఎయిర్ ఫిల్టర్‌లతో సహా ప్రతి భాగాన్ని శుభ్రం చేయండి. నిమ్మరసంతో ఒక గుడ్డను తడిపి కూలర్ లోపల భాగాన్ని శుభ్రం చేయండి.

ట్యాంక్‌లోని నీరు ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చండి. ఇది ట్యాంక్‌లో అచ్చు, బ్యాక్టీరియా, ఇతర శిలీంధ్రాలు పెరగకుండా నిరోధిస్తుంది.

మీ ఎయిర్ కూలర్‌లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించండి.

ఎయిర్ కూలర్‌ను వాడి ఆఫ్ చేసే ముందు, 15 నిమిషాల పాటు నీటి పంపు వాడకుండా ఫ్యాన్-ఓన్లీ మోడ్‌లో రన్ చేయండి.

కూలర్ ట్యాంక్‌లో కొద్దిగా వెనిగర్, ఎసెన్షియల్ ఆయిల్ కలిపి స్ప్రే చేసి ఆపై ఎయిర్ కూలర్‌ను నార్మల్‌గా రన్ చేయండి.

కూలర్ వాడని సమయంలో కాసేపు ఎండలో గానీ, ఎండ తగిలేలా ఉంచండి. ఇది తేమను తొలగిస్తుంది, బ్యాక్టీరియా వృద్ధికి అవకాశం ఇవ్వదు.

మామూలు గడ్డికి బదులు వట్టివేరు గడ్డిని కూలింగ్ ప్యాడ్లలో అమర్చడం ద్వారా కూలర్లు మరింత చల్లని గాలిని ఇస్తాయి, చందనం వాసనను వెదజల్లుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version