కూటమి పాలనలో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరునెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేలమీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని YS జగన్ అన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాతఇళ్ల మీదకూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడంలేదు. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.
ఆరోగ్యశ్రీకింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. 8 నెలల కాలంలోనే 3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటివద్దకే డోర్ డెలివరీ పరిపాలనుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తాను. ప్రతి వారం మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిచేస్తాను. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధంచేయడంలేదు.. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధంచేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్‌మీడియా ద్వారానే సాధ్యం అని YS జగన్ పేర్కొన్నారు.